Prashant Kishor : గాంధీ జయంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్న ప్రశాంత్ కిషోర్
- గాంధీజయంతి రోజు పార్టీ ప్రకటించనున్న పీకే
- బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం
- 243సీట్లలో తన అభ్యర్థులను నిలబెట్టనున్న పీకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishor : త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ ప్రారంభ తేదీని ప్రకటించారు. మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న తన పార్టీని ప్రారంభిస్తానని పీకే స్పష్టం చేశారు. బీహార్ అంతటా రెండు సంవత్సరాల రాజకీయ ప్రయాణం తరువాత, అతను ఇప్పుడు తన సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టనున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు 21 మంది నేతలతో కమిటీని కూడా ఏర్పాటు చేస్తానని కిషోర్ తెలిపారు.
Read Also:G. Kishan Reddy: నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
2021లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు ఘనవిజయం అందించిన ప్రశాంత్ కిషోర్ ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. 2 అక్టోబర్ 2022న అధికారికంగా రాజకీయాల్లోకి రావడానికి ముందు బీహార్ అంతటా యాత్ర చేస్తానని కూడా ప్రకటించాడు. పీకేగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్‌ని స్థాపించారు. పశ్చిమ చంపారన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 5000 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 14 జిల్లాలను కాలినడకన, 10 జిల్లాలను కారులో పర్యటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని మొత్తం 243 స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెట్టాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించారు. ముస్లిం, అట్టడుగు వర్గాల ఓటర్లు కులం, మతం ప్రాతిపదికన ఓటు వేయవద్దని, తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Read Also:Karimnagar: ఒక వైపు బర్త్ డే విషెస్ పోస్ట్ వైరల్.. మరోవైపు ఫ్లెక్సీల వార్..
బీహార్‌లో సామాజిక న్యాయ రాజకీయాలు 1990ల నుంచి ప్రారంభమయ్యాయి. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, ప్రస్తుత బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ రాజకీయాలకు నేతృత్వం వహించారు. జేడీయూతో ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించడం గమనార్హం. 2015లో నితీష్ కుమార్ ఆయనకు పార్టీలో నంబర్ టూ స్థానం కల్పించినా, త్వరలోనే ఇద్దరూ విడిపోయారు. ప్రశాంత్ కిషోర్ ముస్లిం ఓట్లపై నిఘా ఉంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 75 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆయన ప్రకటించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..