Patna crime: స్కూల్ ఆవరణలో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం లభ్యం.. రణరంగంగా పాట్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి ఓ ప్రైవేటు పాఠశాలలో శవమై కనిపించింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు, ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. నిరసనలు, ఆందోళనలతో బీహార్‌లోని పాట్నా రణరంగంగా మారింది.
పాట్నాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడేళ్ల చిన్నారి డ్రైనేజీలో శవమై కనిపించింది. తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి వాకబు చేసినా స్కూల్ యాజమాన్యం నుంచి మాత్రం సరైన జవాబు దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు యాజమాన్యంతో గొడవకు దిగారు. కానీ వారి నుంచి సరైన ఆన్సర్ మాత్రం లభించలేదు. అనంతరం స్కూల్ ఆవరణను మొత్తం వెతికితే డ్రైనేజీలో మృతదేహం కనిపించింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పెద్ద ఎత్తున స్కూల్‌కు చేరి పాఠశాలకు నిప్పుపెట్టారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇది కూడా చదవండి: Shocking incident: ఇంటికి వెళ్తున్న బాలికపై తాగుబోతు వేధింపులు.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు.. స్కూల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో చిన్నారి స్కూల్ లోపలికి వెళ్లిన దృశ్యాలు ఉన్నాయి గానీ.. బయటకు వెళ్లిన దృశ్యాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో స్కూల్లోనే ఏదో జరిగిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాట్నా పోలీస్ సూపరింటెండెంట్ చంద్రప్రకాశ్ తెలిపారు. తరగతి గది లోపల డ్రెయిన్‌లో చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించామని.. హత్య కేసుగానే చూస్తు్న్నట్లు వెల్లడించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. విచారణ కొనసాగుతుందని చంద్రప్రకాశ్ మీడియాకు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్కూల్ నుంచి చిన్నారి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. దీంతో విద్యాసంస్థకు వచ్చి వాకబు చేస్తే సరైన జవాబు దొరకలేదు. దీంతో అనుమానాలు తలెత్తాయి. బంధువలతో కలిసి వెతుకులాట ప్రారంభించగా.. స్కూల్ డ్రైనేజీలో మృతదేహం లభ్యమైంది. అసలు చిన్నారి ఎందుకు శవమైంది? స్కూల్ యాజమాన్యం ఎందుకు సరిగ్గా స్పందించలేదు. బాధ్యతగా స్కూల్ యాజమాన్యం ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు. అసలేం జరిగింది. ఇప్పుడు ఈ మిస్టరీ వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది.
#WATCH | Patna, Bihar: An angry crowd sets a school on fire after the body of a student was allegedly found on school premises. More details awaited. pic.twitter.com/6OwmDe8mjY
— ANI (@ANI) May 17, 2024
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!