Sweden : స్వీడన్ సోమవారం కొత్త విప్లవాత్మక చట్టాన్ని అమలు చేసింది. దీని ప్రకారం, బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరంలో మూడు నెలల పాటు తమ మనవళ్లను చూసుకోవడానికి తాత అవ్వలకు వేతనంతో కూడిన పితృత్వ సెలవును తీసుకోవచ్చు. స్వీడన్‌లోని 349 సీట్ల పార్లమెంట్ ‘రిక్స్‌డాగ్’ గత ఏడాది డిసెంబర్‌లో పితృత్వ భత్యం బదిలీపై ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టం అమలు చేయబడింది.
Read Also:Rashmika Mandanna: మరోసారి సీమ యాస, ఆహార్యంతో సందడి చేయనున్న రష్మిక మందన్న!
పితృత్వ సెలవు భత్యం
ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు తమ ఉదారమైన పితృత్వ సెలవు భత్యంలో కొంత భాగాన్ని పిల్లల తాతలకు బదిలీ చేయవచ్చు. తల్లిదండ్రుల జంట గరిష్టంగా 45 రోజుల సెలవును ఇతరులకు బదిలీ చేయవచ్చు. సింగిల్ పేరెంట్ ఉంటే 90 రోజుల సెలవుల్ని ఇలా మార్పిడి చేసుకోవచ్చు.
Read Also:Zika Virus : పుణెలో జికా వైరస్ కలకలం.. వెలుగులోకి ఆరు కేసులు.. రోగుల్లో ఇద్దరు గర్భిణులు
పుట్టుక నుండి మరణం వరకు శ్రద్ధ
దాదాపు కోటి జనాభా ఉన్న స్వీడన్.. పుట్టుక నుంచి చావు వరకూ తమ పౌరుల సంక్షేమాన్ని ప్రభుత్వమే చూసుకునేలా అనేక పథకాల్ని అమలుచేస్తోంది. ప్రపంచంలోనే మొదటిసారిగా, సరిగ్గా 50 ఏళ్ల కిందట పితృత్వ సెలవుల్ని తెచ్చిందీ స్వీడనే! అక్కడ ప్రస్తుతం బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు 480 రోజులపాటు వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు