Site icon NTV Telugu

Kishan Reddy : కిషన్ రెడ్డి ఉపవాస దీక్షకు మద్దతుగా.. పటాన్ చెరు నేతలు

Bjp

Bjp

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి 24 గంటల నిరాహార దీక్ష పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఇందిరా గాంధీపార్క్‌లోని ధర్నా చౌక్‌లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా 24 గంటల దీక్ష ఏర్పాటు చేశారు. అయితే.. ఈ దీక్షలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు తరలివెళ్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే పటాన్‌ చెరు బీజేపీ నేతలు సైతం కిషన్‌ రెడ్డి చేపట్టనున్న 24 గంటల నిరాహార దీక్షలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. నిరుద్యోగుల కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్షకు మద్దతుగా పటాన్ చెరు నుంచి గోదావరి అంజిరెడ్డి నేతృత్వంలో పలురు బీజేపీ నేతలు బయలుదేరారు.

Also Read : Akkineni Nagarjuna: ఏంటీ బాసూ.. ఇంకా సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదా.. ?

కిషన్ రెడ్డి చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్షకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అంజిరెడ్డితో పాటు పటాన్ చెరు నుంచి బూత్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, బూత్ అధ్యక్షులు ఎస్.రాజు, జగన్ గౌడ్, యాదిరెడ్డి, కిష్టరెడ్డి, రమేష్ గుప్తా, వెంకట్ రెడ్డి, జయపాల్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, రాములు, శేఖర్ గౌడ్, రాంబాబు, నాగిరెడ్డి, సత్యనారాయణ, చందు, లక్ష్మణ్ రావు, అమృత, బాలాజీ తదితరులు తరలివెళ్లారు.

Also Read : Skill Development Scam: స్కిల్‌ స్కామ్‌ కేసు.. ఆధారాలు బయటపెట్టిన సజ్జల..!

Exit mobile version