Passion : సుధీష్ వెంకట్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పేషన్’.ఈ సినిమాలో అంకిత సాహ, శ్రేయాసి షా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బిఎల్ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె మరియుఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు.ఈ “పేషన్” మూవీ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా రూపొందుతుంది.దర్శకుడు అరవింద్ జోషువా శేఖర్ కమ్ముల ,ఇంద్రగంటి వంటి స్టార్ డైరెక్టర్స్ వద్ద ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేసారు.ప్రస్తుతం పేషన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.
Read Also :Chakram ReRelease : మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేస్తున్న ప్రభాస్ క్లాసిక్ మూవీ..
“పేషన్” సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.హైదరాబాద్ లోని పలు ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ ను చిత్ర యూనిట్ మొదలు పెట్టనున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలోని సరికొత్త టెక్నికల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించాము.ప్రేమకు ,ఆకర్షణకు మధ్య వున్న అనేక ప్రశ్నలకు మా “పేషన్” మూవీ సమాధానం ఇస్తుంది.ఈ సినిమాలో యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు ప్రస్తుత యువతకు సందేశం కూడా ఇచ్చినట్లు దర్శకుడు తెలిపారు.త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు దర్శకుడు తెలిపారు.