Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collector Prabhakar Reddy: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (PTM)లో పాల్గొని అందరికి ఆదర్శంగా నిలిచారు. అధికారిగా కాకుండా.. ఓ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ కుమారుడితో కలిసి పాఠశాలకు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని డీవీఎంఎం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తన కుమారుడు క్రిస్ ధరణ్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాఠశాలకు వచ్చారు. ఇతర విద్యార్థుల తల్లిదండ్రుల మాదిరిగానే తరగతి గదిలో కూర్చొని ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఎలాంటి ప్రత్యేక హంగులు, ఆర్భాటాలకు తావివ్వకుండా సాధారణ తల్లిదండ్రిలా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను కలిసి తన కుమారుడి చదువు, విద్యా పురోగతి, ప్రతిభ గురించి తెలుసుకున్నారు. విద్యార్థి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఉపాధ్యాయులతో ముఖాముఖి చర్చించారు. ఆ తర్వాత స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మెగా పీటీఎం కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత తీసుకురావడంలో కలెక్టర్ పాల్గొనడం ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
కలెక్టర్ ప్రభాకరరెడ్డి సాధారణ తల్లిదండ్రిలా తరగతి గదిలో కూర్చోవడం, ఉపాధ్యాయులతో మాట్లాడటం, విద్యార్థులతో కలిసి భోజనం చేయడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ అధికారి అయినప్పటికీ.. తల్లిదండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించిన ఆయన తీరును పలువురు అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!