Paritala Sriram And Vangaveeti Radha: ఈ ఇద్దరి కలయిక ఏపీలో హాట్ టాపిక్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. ఏపీ రాజకీయాల్లో అమరావతి పాదయాత్ర, విశాఖ గర్జన, పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ ఇప్పుడు హాట్ టాపిక్ లు.. కానీ మరో అంశం తెరమీదకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ యువ నేతలు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ రాజమహేంద్రవరం వేదికగా కలిశారన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ రాజకీయంగా వివిధ అంశాలను తెరమీదకు తెచ్చింది. ఆదివారం రాత్రి ఈ ఇద్దరు యువ నేతలు రాజమహేంద్ర వరంలో భేటీ అయ్యారు. ఇదేం గాసిప్ కాదు.. స్వయంగా పరిటాల శ్రీరామ్ సోషల్ మీడియా వేదికగా దీనిని ప్రకటించారు. ఇద్దరూ చాలాసేపు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!

ఏపీలో వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరాం ఇద్దరు రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన కుటుంబాల నుంచి వచ్చారు. ఈ కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర సోమవారం రాజమహేద్రవరంలోకి ప్రవేశించనుంది. ఈ ఇరువురు నేతలు అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలపనున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చిన రాధా, శ్రీరామ్‌లు మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్‌తో కలిసి సమావేశమయ్యారు.
గతంలో వంగవీటి రాధకు పరిటాల శ్రీరామ్ మద్ధతుగా నిలిచారు. రాధాపై రెక్కీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో శ్రీరామ్ అప్పట్లో తీవ్రంగా స్పందించారు. రాధాను ఎవరైనా టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచనలం సృష్టించాయి. టీడీపీ నేతలు కూడా రాధాకు సంఘీభావం తెలిపారు. స్వయంగా చంద్రబాబునాయుడే రాధాను పరామర్శించారు. రాధాకు మేం అండగా వుంటామంటూ భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో ఈ యంగ్ తరంగ్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాజమండ్రి నగరంలో వంగవీటి రాధా గారితో సమావేశమైన సందర్భంగా… pic.twitter.com/OoJlwLYt9l
— Paritala Sreeram (@IParitalaSriram) October 16, 2022
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!