Manu Bahaker About PV Sindhu Fake Profile: భారత మహిళా షూటర్ మను బాకర్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈ హరియాణా అమ్మాయి రికార్డుల్లో నిలిచింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మను.. అదే వేదికపై సహచరుడు సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. రెండు పతకాలు సాధించిన మను తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కోసం తాను ఓ ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేశానని తెలిపింది.
‘భారత క్రీడా చరిత్రలో గొప్ప వారి గురించి నేను ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటా. ప్రస్తుత తరంలో పీవీ సింధు, నీరజ్ చోప్రా బాగా తెలుసు. ఇద్దరు గొప్ప అథ్లెట్స్. వారి శ్రమను అభినందించలేకుండా ఉండలేం. ఓ సమయంలో నేను పీవీ సింధు కోసం ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేశా. కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతో వారి నుంచి ఆమెను డిఫెండ్ చేయడానికి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశా. నెటిజన్లకు కౌంటర్ ఇస్తూ అడ్డుకొనేందుకు ప్రయత్నించా’ అని మను బాకర్ తెలిపింది.
Also Read: Hamas Chief: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య!
ఈ అంశంపై తాజాగా తెలుగు తేజం పీవీ సింధు స్పందించింది. ‘మీ మంచి మనసుకు ధన్యవాదాలు. రెండు ఒలింపిక్ పతకాల క్లబ్‌లోకి మను బాకర్‌కు స్వాగతం. మేం కూడా నీ మార్గంలోనే ఉన్నాం’ అని సింధు పేర్కొన్నారు. పీవీ సింధు నేడు బరిలోకి దిగనుంది. మహిళల సింగిల్స్ పోటీలో క్రిస్టిన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరగనుంది. ఇందులో విజయం సాధిస్తే క్వార్టర్స్‌కు చేరుకుంటుంది.