Site icon NTV Telugu

Paripurnanada : హిందువులకు మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి..

Paripurnanda

Paripurnanda

జగిత్యాల జిల్లాలో వీర హనుమాన్ శోభయాత్రలో పరిపూర్ణనంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రెండు రకాల ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని హిందువులకు.. హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యాత్రలో పాల్గొన్న పరిపూర్ణనంద స్వామి కామెంట్స్ చేశారు. హిందూ ధర్మాన్ని గౌరవించని వాళ్లు, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోవాలన్నారు. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హిందూవులకు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆధార్ ఇవ్వలన్న అంశం అమలు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాలకు చెప్తే జగమంతా చెప్పినట్టేనన్నారు.

Read Also : Delhi Capitals : గుజరాత్ మ్యాచ్ కు అందుబాటులో రిషబ్ పంత్

అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తేవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశంలో హిందువుగా జీవించే వారికి ఆధార్ కార్డులు ఇవ్వాలి.. హిందువులు కాకుండా.. హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలి అన్నారు. ఈ చట్టం తేవడం కోసం.. ఇది అమలు కోసం పార్లమెంట్ తో పాటు అన్ని స్థాయిలోనూ ఆ దిశగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి అని పరిపూర్ణనంద స్వామి అన్నారు.

Read Also : Madhyapradesh: ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో రూ. 49 పెట్టుబడి.. ఓవర్ నైట్‌లో రూ.1.5 కోట్ల గెలుపు

అందుకోసమే ఈ హిందువులకు ఆధార్ కార్డు అనే అంశానికి ఇక్కడి నుంచే దేశవ్యాప్తం కావాలి అని పిలుపునిచ్చారు. వీర హనుమాన్ విజయ యాత్రలో పరిపూర్ణనంద స్వామితో పాటు నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ వెంకట్రాజ్ రెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు బోయిని పద్మాకర్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు. పరిపూర్ణనంద స్వామి చేసిన వ్యాఖ్యలపై విభిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.

Exit mobile version