తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏ సమయాన సర్కారు వారి పాట సినిమాను ఒప్పుకున్నాడో తెలియదు కానీ..అప్పటి నుండి ఆయన టైం అస్సలు బాగుండటం లేదు. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో నాగ చైతన్య పరశురామ్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అంటూ సెన్సషనల్ కామెంట్స్ కూడా చేశాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కూడా ఇండైరెక్ట్ గా పరశురామ్ పై కామెంట్స్ ను చేశాడు. దీంతో ఇండస్ట్రీలో మొత్తం పరశురామ్ గురించి చర్చ మొదలైందని తెలుస్తుంది..
ఇక తాజాగా పరశురామ్ కు మరో షాక్ కూడా తగిలింది. కొన్నేళ్ల క్రితం పరశురామ్ నాగచైతన్య తో ఒక సినిమా చెయ్యడాని కి కమిట్ అయ్యాడని సమాచారం.. ఈ ప్రాజెక్ట్ కోసం 14 రీల్స్ సంస్థ నుండి సుమారు 6 కోట్లు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఇక సినిమా మొదలవుతుంది అనే సమయం లో పరశురామ్ కు మహేష్ బాబు సినిమా అఫరొచ్చిందని సమాచారం.. దాంతో నాగచైతన్య సినిమాను దూరం పెట్టినట్లు సమాచారం.ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అయిపోయింది.. దీంతో 14 రీల్స్ సంస్థ తమ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలని పరశురామ్ ను కోరింది. తీసుకున్న అడ్వాన్స్ కు వడ్డీతో కలిపి 13 కోట్లు కట్టాల్సిందిగా వారు డిమాండ్ చేసారు.. ఈ మనీ సెటిల్మెంట్ లో పరశురామ్ కు దిల్ రాజు సహాయం చేసారు.. ప్రస్తుతం దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబో లో పరశురామ్ ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.. ఈ సినిమా రెమ్యునరేషన్ తో పాటు మరికొంత దిల్ రాజు దగ్గర అప్పు చేశాడట దర్శకుడు పరశురామ్. ఇక మొత్తంగా మహేష్ ఆఫర్ వల్ల ఈ దర్శకుడు కి 7 కోట్ల కు పైగా నష్టం వచ్చిందని తెలుస్తుంది..