Sudan: సూడాన్‌లోని వాద్ అల్ నౌరా గ్రామంపై పారామిలిటరీ రాపిడ్ ఫోర్సు దాడి..దాదాపు 150 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూడాన్‌లో తిరుగుబాటు దళాల దాడిలో దాదాపు 150 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, సాక్షులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడాది కాలం యుద్ధంలో ఇప్పటి వరకు 7 మిలియన్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. సెంట్రల్ సూడాన్‌లోని(గెజిరా) వాద్ అల్ నౌరా గ్రామంపై పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్.ఎస్.ఎఫ్) చేసిన దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 150 మంది మరణించారు. ఈ ఘటనను వాద్ మదానీ రెసిస్టెన్స్ కమిటీలు సోషల్ మీడియా ద్వారా నిర్ధారించాయి.
READ MORE: Russia: రష్యాలోని వోల్ఖోవ్ నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థుల మృతి
Also Read
- Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
- Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్‌మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్‌గా రికార్డు..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
సుడాన్ యొక్క పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) నుంచి యోధులు బుధవారం సెంట్రల్ అల్-జజీరా రాష్ట్రంలోని వాద్ అల్-నౌర్ గ్రామంలోకి ప్రవేశించారు. 40కి పైగా సాయుధ వాహనాలు గ్రామంలోకి దూసుకొచ్చాయి. నివాసులపై భారీ ఆయుధాలను ప్రయోగించాయి. దీంతో గ్రామంలో భయాందోళన వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది పౌరులు మృత్యువాత పడ్డారు. వందలకు పైగా జనాలకు గాయాలయ్యాయి. మారణహోమ దృశ్యాలను వారు” ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ” కు వివరించారు.
READ MORE: Russia: రష్యాలోని వోల్ఖోవ్ నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థుల మృతి
“ఇప్పటివరకు, మేము గ్రామం మధ్యలో ఉన్న సామూహిక సమాధిలో 120 మందికి పైగా ఖననం చేసాము.” అని ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. ఫుటేజీ బుధవారం సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేశారు. అందులో వాద్ అల్-నౌరా గ్రామంలో డజన్ల కొద్దీ మృతదేహాలను చుట్టుముట్టిన పెద్ద గుంపు కనిపిస్తుంది. మధ్యలో ఉన్న మృతదేహాలపై తెల్లటి రంగు వస్త్రాలు కప్పారు. వాటి ఖననం కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు చూడొచ్చు. మరో వీడియోలో ఆర్ఎస్ఎఫ్ మిలీషియా భారీ, మధ్యస్థ ఆయుధాలతో గ్రామం వైపు కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
-
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్‌మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్‌గా రికార్డు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!