Drug Network: మరో భారీ డ్రగ్ నెట్వర్క్.. ఛేదించిన పంజాగుట్ట పోలీసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Network: డ్రగ్స్‌కు అడ్డాగా తెలంగాణ మారుతోంది. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును పోలీసులు ఛేదించారు. గోవా, ముంబయి, ఢీల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తో ముడి పడ్డ మరో భారీ డ్రగ్ నెట్వర్క్ ఛేదించిన పంజాగుట్ట పోలీసులు. పెద్ద ఎత్తున ఎక్స్టోసి మాత్రలు, ఎండీఎంఏ, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరబాద్ డ్రగ్స్ తెచ్చి కస్టమర్లకు విక్రయిస్తున్న సయూద్, ముంబాయికి చెందిన రోమి, పాలస్తీనాకు చెందిన సయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సయీద్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. నిందితుల నుంచి 4.75 గ్రాముల ఎక్స్టోసి పిల్స్, 5.18 గ్రాముల ఎండీఎంఏ, 109 గ్రాముల గంజాయి, రెండు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read also: Tillu Sqaure: డైరెక్టర్ మార్పుపై ఎట్టకేలకు నిజం చెప్పేసిన హీరో జొన్నలగడ్డ సిద్దు..!
Also Read
- Passport Fee: పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
14 మంది స్మగ్లర్లు, హైదరాబాద్‌కి చెందిన 31 మంది వినియోగదారులను పంజాగుట్ట పోలీసుల లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సయీద్ హైదరాబాద్‌లో మకాం వేసినట్లు గుర్తుంచారు. సయీద్ ఆర్డర్ మేరకు గోవాలోని క్రిస్ నుంచి కొనుగోలు చేసి రోమీ అందిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇక మరోవైపు జగిత్యాలలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో తాజాగా మరో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని గంజాయికి బానిస చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఈ గంజాయి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ నిందితులను ప్రేమ్, వెంకటేశ్, నితిన్‌గా గుర్తించారు. వారిపై పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
Anantapur Lok Sabha: ఆ ఎంపీ సీటుపై టీడీపీలో స్పష్టత కరువు.. తెరపైకి రోజుకో పేరు..!
- Tags
- Drugs
- Extosi pills
- Goa
- hyderabad
- MDMA
తాజావార్తలు
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!