NTV Telugu Site icon

NIMS Hospital: నిమ్స్ ఆస్పత్రిలో దారుణం.. చేయని తప్పుకు కార్మికున్ని చితకబాదిన పోలీసులు

Nims Hospital

Nims Hospital

నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది.. చేయని తప్పుకి ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు. ఎమ్మారై స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్ బంగారు గొలుసు పోయిందని కాంట్రాక్టు కార్మికుని కొట్టారు. పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాంట్రాక్టు కార్మికుల్ని గొలుసు గురించి ప్రశ్నించారు. తాను తీసుకోలేదని చెప్పినా వినకుండా విచక్షణారహితంగా చేయి చేసుకున్నారు. చివరికీ ఆ గొలుసు పేషంట్ ఇన్నర్ పాకెట్లో దొరికింది. ఎలాంటి విచారణ చేయకుండా పోలీసులు ఈ విధంగా కార్మికుడిని కొట్టడాన్ని ఖండిస్తూ.. కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కనీసం కాంట్రాక్టర్‌, నిమ్స్ యాజమాన్యానికి కూడా సమాచారం ఇవ్వకుండా ఎమ్మారై విభాగం పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం ఆ కార్మికుడు నిమ్స్ ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నాడు.

READ MORE: Manmohan Singh: మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొనే ప్రముఖుల షెడ్యూల్ ఇదే!

ఇదిలా ఉండగా.. నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం వింత వ్యవహారం బయటకు వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో హాలిడే అంటూ ప్రకటన వెలువడింది. ఇవ్వాళ ఉదయాన్నే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ పేరుతో ఓపీ వైద్య సేవలకు సెలవు అని ప్రకటన విడుదలైంది. ఇది ప్రకటించిన కొన్ని గంటలకు మరోసారి ప్రకటన వచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు యథాతథం అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో రోగులతో పాటు, వైద్యులు కూడా గందరగోళానికి గురయ్యారు. ఇటువంటి ప్రకటనల వల్ల అనేకమంది రోగులు ఇబ్బందులు పడ్డారు.