NIMS Hospital: నిమ్స్ ఆస్పత్రిలో దారుణం.. చేయని తప్పుకు కార్మికున్ని చితకబాదిన పోలీసులు
- నిమ్స్ ఆస్పత్రిలో దారుణ ఘటన
- చేయని తప్పుకి కాంట్రాక్ట్ కార్మికున్ని చితక బాదిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది.. చేయని తప్పుకి ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు. ఎమ్మారై స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్ బంగారు గొలుసు పోయిందని కాంట్రాక్టు కార్మికుని కొట్టారు. పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాంట్రాక్టు కార్మికుల్ని గొలుసు గురించి ప్రశ్నించారు. తాను తీసుకోలేదని చెప్పినా వినకుండా విచక్షణారహితంగా చేయి చేసుకున్నారు. చివరికీ ఆ గొలుసు పేషంట్ ఇన్నర్ పాకెట్లో దొరికింది. ఎలాంటి విచారణ చేయకుండా పోలీసులు ఈ విధంగా కార్మికుడిని కొట్టడాన్ని ఖండిస్తూ.. కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కనీసం కాంట్రాక్టర్, నిమ్స్ యాజమాన్యానికి కూడా సమాచారం ఇవ్వకుండా ఎమ్మారై విభాగం పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం ఆ కార్మికుడు నిమ్స్ ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నాడు.
READ MORE: Manmohan Singh: మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొనే ప్రముఖుల షెడ్యూల్ ఇదే!
Also Read
ఇదిలా ఉండగా.. నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం వింత వ్యవహారం బయటకు వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో హాలిడే అంటూ ప్రకటన వెలువడింది. ఇవ్వాళ ఉదయాన్నే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ పేరుతో ఓపీ వైద్య సేవలకు సెలవు అని ప్రకటన విడుదలైంది. ఇది ప్రకటించిన కొన్ని గంటలకు మరోసారి ప్రకటన వచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు యథాతథం అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో రోగులతో పాటు, వైద్యులు కూడా గందరగోళానికి గురయ్యారు. ఇటువంటి ప్రకటనల వల్ల అనేకమంది రోగులు ఇబ్బందులు పడ్డారు.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!