NTV Telugu Site icon

Palvai Sravanthi : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని అర్ధం అయ్యింది

Palvai Sravanthi

Palvai Sravanthi

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. రోజు రోజు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే.. నిన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరుతో ఓ ఆడియో టేపు వైరల్‌ అయ్యింది. దీంతో.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు అంతా ఎన్నికల హడావుడిలోనే ఉన్నాం వెంకటరెడ్డి మాటలు ఇప్పుడే విన్నాను కానీ క్లారిటీగా లేకపోవడం వల్ల అర్ధం కాలేదు వెన్ను పాటు పొడుస్తున్నారని అర్ధం అయ్యిందని ఆమె అన్నారు.

Also Read : NFHS : తెలంగాణలో వెజ్‌ తినేవారు 2.7 శాతమేనంట.. మిగితావారంతా నాన్ వెజ్ మీద పడ్డారంట

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుతో మనస్థాపానికి గురయ్యానన్న పాల్వాయి స్రవంతి.. మీ మద్దతు కావాలని అడిగినప్పుడు.. సాధ్యం కాదని ముందే చెప్పి ఉంటే బాగుండేది కానీ పూర్తిగా మద్దతు ఇస్తానని చెప్పి ఇలా వెనకాల కుట్రలు చేయడం బాధించిందన్నారు. వెంకట్ రెడ్డి తీరుపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను కానీ ఇప్పుడు ఎన్నికల మీదనే నా దృష్టాంతా ఉందని ఆమె వెల్లడించారు. వెంకట్ రెడ్డి అంశం అధిష్టానం చూసుకుంటుందని, ఒక్కరిద్దరు నేతలతో మా కార్యకర్తల మనోబలం దెబ్బతీయలేరని ఆమె అన్నారు.