Palnadu News : పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో విషాదం నింపింది. పిల్లలు సహ తల్లి ప్రాణాలు బలి తీసుకుంది. నుజేండ్ల మండలం తెల్లబాడుకు గ్రామానికి చెందిన సౌజన్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో గడ్డి మందు తాగించి, తాను ఆత్మహత్యకు యత్నించింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. పిల్లలు శివ పార్వతి, 9 నెలల మనితేజకు ముందుగా గడ్డి మందు తాగించింది. ఆ తర్వాత తాను గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఇరుగుపొరుగు వారు గమనించి నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి సౌజన్య లక్ష్మి, బాబు మనితేజ మృతి చెందారు. పాప శివ పార్వతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులు గడిస్తే గాని పాప సంగతి చెప్పలేమని వైద్యులు తెలియజేశారు.
Read Also: Tirupati laddu: భక్తుల్లో ఆందోళన వద్దు.. బరువు తగ్గదు తిరుపతి లడ్డూ.. తూనికల శాఖ చెప్పిందిదే..?
ఇది ఇలా ఉంటే.. అదే జిల్లా నరసరావుపేటలో మరో దారుణం జరిగింది. మరోసారి ఆడ బిడ్డకు జన్మనిస్తుందని తెలిసి మెట్టినింటి వారు కోడలికి విషమిచ్చారు. దీంతో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంది. కొప్పురాపాలెంకి చెందిన శ్రావణికి.. రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెంకు చెందిన వేణుతో మూడేళ్ల కిందట పెళ్లైంది. వారికి ఇది వరకే ఓ పాప కలిగింది. మళ్లీ గర్భం దాల్చడంతో ఈ సారి పుట్టేది ఆడపిల్ల అని తెలుసుకున్నారు. దీంతో రెండో సారి కూడా ఆడపిల్ల అని తెలియడంతో అత్తింటివారు కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి కోడలితో తాగించారని శ్రావణి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణి అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను నరసరావుపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చావుతో పోరాటం చేస్తుంది శ్రావణి. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.