NTV Telugu Site icon

CM Chandrababu: సీఎం హామీ ఇచ్చారు.. కలెక్టర్ అమలు చేశారు..

Cm Chandrababu

Cm Chandrababu

పల్నాడు జిల్లా యలమంద గ్రామానికి చెందిన ఉల్లంగుల ఏడుకొండలుకు కలెక్టర్ పి.అరుణ్ బాబు ఎయిర్ కంప్రెషర్ అందజేశారు. ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాన్ని.. జిల్లా కలెక్టర్ వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఎయిర్ కంప్రెషర్ ను అందజేశారు.

READ MORE: Rajasthan Borewell Incident: అద్భుతం.. 10 రోజుల తర్వాత బోరుబావి నుంచి సురక్షితంగా బాలిక..

కాగా.. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఉల్లంగుల ఏడుకొండలుకు ఇంటివద్దే పింఛను అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు స్వయంగా కాఫీ తయారు చేసి మరీ ఇచ్చిన వార్త, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడు ఏడుకొండలు కుటుంబ పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. తమకు బతుకు దెరువు చూయించాలని ఆ కుటుంబం సీఎంను అడగ్గా.. ఆయన హామీ ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల చెక్కును ప్రజా వేదిక వద్దే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అప్పటికప్పుడే అందజేశారు. ముఖ్యమంత్రి రాకతో తమ ఇంటికి వెలుగొచ్చిందని, హామీలు అమలు చేసి ఆ వెలుగు కలకాలం నిలిచేలా చేశారని ఏడుకొండలు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావు పేట ఆర్డీవో మధులత, తహశీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

READ MORE: Delhi: నోయిడాలో దారుణం.. పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు కత్తితో దాడి

Show comments