పల్నాడు జిల్లా యలమంద గ్రామానికి చెందిన ఉల్లంగుల ఏడుకొండలుకు కలెక్టర్ పి.అరుణ్ బాబు ఎయిర్ కంప్రెషర్ అందజేశారు. ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాన్ని.. జిల్లా కలెక్టర్ వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఎయిర్ కంప్రెషర్ ను అందజేశారు.
నూతన సంవత్సరం వేళ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో 1995 సీఎంను చూస్తారని చంద్రబాబు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. తాను రాజకీయ కక్షలకు పాల్పడనని చెప్పారు. అలాగని.. తప్పు చేసే వాళ్లను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. సెకీ అంశం తనకు లాడ్డూ లాగే అనిపిస్తుందన్నారు.