Salaar: ఆరు రోజుల్లో 70% రికవరీ… అయినా అప్సెట్ లో ఉన్న ఫ్యాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన సలార్ సినిమాకు… సోమవారం క్రిస్మస్ హాలీడేతో లాంగ్ వీకెండ్ ముగిసింది. దీంతో మంగళవారం నుంచి సలార్ వసూళ్లు కాస్త స్లో అయ్యాయి. నాలుగు రోజుల్లో 450 కోట్లు క్రాస్ చేసిన సలార్… ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్ దాటిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసేలా ఉంది. వారం రోజులు తిరగకుండానే సలార్ సినిమా ఆల్మోస్ట్ 70% పర్సెంట్ థియేటర్ బిజినెస్ ని రికవర్ చేసింది. దీంతో అంత భారీ టార్గెట్ ని కూడా రెండు వారాల్లో రీచ్ అవ్వబోతున్నాం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ హర్ట్ అయ్యారనే చెప్పాలి. సూపర్ హిట్ కొట్టి కూడా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అప్సెట్ అవ్వడానికి కారణం ప్రభాస్ మాత్రమే…
అభిమానులు ప్రభాస్ ని పబ్లిక్ ఈవెంట్స్‌లో చూసి చాలా రోజులే అవుతోంది. చివరగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించిన ప్రభాస్… మళ్లీ మీడియా ముందుకు గానీ, పబ్లిక్ మీటింగ్స్‌లలో గానీ కనిపించలేదు. సలార్ ప్రమోషన్స్ కోసమైనా బయటికి వస్తాడు అనుకుంటే… ఈవెంట్ కాదు కదా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. దీంతో ఇక ప్రభాస్‌ను ఇంటర్య్వూలు, సినిమాల్లో మాత్రమే చూడాలా? అనే డౌట్స్ వస్తున్నాయి. సలార్ హిట్ అయినా కూడా ఇప్పటివరకు మీడియా ముందుకి కూడా రాలేదు ప్రభాస్. పోనీ సలార్ సక్సెస్ మీట్ అయినా ఉంటుందా? అంటే అది లేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. ఎన్ని ఇంటర్య్వూలు ఇచ్చినా… ఒక్కసారి ప్రభాస్ బయటికొచ్చి… హలో డార్లింగ్స్ అంటూ సలార్ గురించి మాట్లాడితే ఆ కిక్కే వేరు కానీ ఈసారికి ఇది కష్టమనే చెప్పాలి. అయితే… నెక్స్ట్ రానున్న కల్కి, మారుతి సినిమాలకైనా ప్రభాస్ ప్రమోషన్స్ చేస్తాడా? లేదంటే… ఇలాగే కంటిన్యూ చేస్తాడా? అనేది చూడాలి.
Also Read
- Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
- Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
తాజావార్తలు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!