NTV Telugu Site icon

Paleru Politics : పాలేరులో బావ బావమర్దుల రాజకీయాలు

Paleru

Paleru

పాలేరు లో సీపీఎంకు సీటు ఇస్తే మా బావ మాకు మద్దతు ఇస్తానని చెప్పారు.. అందువల్ల మా బావకు సీటు ఇస్తే వస్తే మేం కూడ మద్దతు ఇస్తాం… సీపీఎం రాష్ర్ట కార్యదర్శి నిన్న కామెంట్ చేస్తే.. ఈ రోజు మాత్రం ఆ బావ బావమర్ధి కి చెక్ పెట్టాడు కూడ. పాలేరులో నేనే పోటీ చేస్తాను.. నాకే సీటు వస్తుంది కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయి అని కందాల ఉపేందర్ రెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కేలా చేశాయి. గత రెండు రోజుల నుంచి ఖమ్మం జిల్లాలో సీసీఎం జన చైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. ఈ యాత్రలలో బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొని సందేశాలు ఇస్తున్నారు. మా వెంట మీరు ఉండాలని కమ్యూనిస్టులను బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. అందులో భాగంగానే నిన్న పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో జరిగిన కార్యక్రమంలో సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Also React : Kushboo Sundar: మోదీ ఇంటిపేరుపై ఖుష్బూ చేసిన పాత ట్వీట్‌ వైరల్.. ‘పరువు నష్టం కేసు వేస్తారా?’

అయితే కమ్యూనిస్టులకు ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయి అని పాలేరు సీటు నాకే వస్తుంది నేనే గెలుస్తాను అంటూ కందాల ఉపేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న ఒకే వేదిక మీద పాల్గొన్న నేతలు ఈ రోజు మాత్రం మాట మార్చేశారు. దళిత క్రిస్టియన్ సభలో మాట్లాడుతూ కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయి అన్న కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read : Minister KTR : ఈ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడతాం

అయితే పాలేరు నియోజవర్గంలో ఇప్పుడు తమ్మినేని, కందాల లు ఇద్దరు బావ బావమర్దులు అంట. అలా ఉంటారంట. అదే తమ్మినేని కూడ చెప్పాడు. నిన్న కూసుమంచిలో జన చైతన్యయాత్రలో పాల్గొన్న సందర్బంగా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్న మేం మద్దతు ఇస్తామని అలానే పోతామని తమ్మినేని చెప్పారు. తమ పార్టీ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ తో కలసి పాలేరులో పోటీ చేయాలని భావిస్తే అలానే పోటీ చేస్తామని తమకు మద్దతు కూడ ఇస్తానని మా బావ కందాల ఇంతకు ముందే చెప్పారని తమ్మినేని వ్యాఖ్యానించారు. నిన్న తమ్మినేని బావ కందాలను వ్యాఖ్యానిస్తూ ఈ రోజు మాత్రం ఆ బావకు కందాల షాక్ ఇచ్చారు. మరి కందాల షాక్ నుంచి కమ్యూనిస్టులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది..