NTV Telugu Site icon

Palakurthi Thikka Reddy: బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్..

Tikkareddy

Tikkareddy

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో తెలుగు ప్రజల ఆశాజ్యోతి.. తెలుగు ప్రజల గుండెచప్పుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పన్నాగా వెంకటేశ్వర్లు స్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని.. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

Jammu Kashmir: ఎల్ఓసీ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు.. ఆర్మీ జవాన్ మృతి, ఇద్దరికి గాయాలు

అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చాటుతు తెలుగువారి ప్రభావాన్ని, వైభవాన్ని గుర్తు చేస్తూ వారిలో ఆత్మ విశ్వాసం నింపుతూ రాష్ట్రం అంతట ఉపన్యాసాలు ఇస్తూ పర్యటించారని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. అంతేకాకుండా.. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్ల నిర్మాణాలు, జనత వస్త్రాలు, వృద్ధాప్య పింఛన్లు, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రజల వద్దకు పాలన తెచ్చారన్నారు. మరోవైపు.. సినీ రంగానికి, రాజకీయ రంగానికి వన్నెతెచ్చిన నాయకుడు, ప్రజా నాయకుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు.

Vizag: ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు విశాఖ ఆథిత్యం

ఈ కార్యక్రమంలో బూదురు మల్లికార్జున రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి, విజయరామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, చావిడి వెంకటేష్, అబ్దుల్, పవన్ కుమార్, చిలకలదోన హనుమంతు, తిక్క స్వామిగౌడ్, బండ్రాల నరసింహులు, జెట్టి వీరేష్, భాస్కర్ రెడ్డి, మాలపల్లి చంద్ర, భీమన్న, చలపతి, సల్మాన్ రాజు, నీలకంఠ, శంకర్ నాయక్, చిదానంద, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.