Site icon NTV Telugu

Pakistan: భారత్ దెబ్బకు పాకిస్థాన్ మార్కెట్ కుదేలు.. కిలో చికెన్ రూ.800!

Pakisthan

Pakisthan

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది. తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పలు ఆంక్షలు విధించడంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది. భారత్‌తో ఖయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కింది. ఇప్పటికే ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ చికెన్ ధర దాదాపు రూ. 800లకు చేరుకుంది. పాక్ ప్రజలు దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ముందు ఇల్లు చక్కబెట్టుకోవడం మర్చిపోయి భారత్‌పై కారాలు మిరియాలు నూరుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూత్రం ఇప్పుడు పాకిస్థాన్ కు బాగా అబ్బుతుంది. పాకిస్థాన్‌లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరల గురించి తెలుసుకుందాం.

READ MORE: Multizone IG: కర్రెగుట్ట ఆపరేషన్స్‌లో టీజీ పోలీసులు పాత్ర లేదు.. తెలంగాణ మావోయిస్టులు లొంగిపోవాలి..

కిలో చికెన్: 798.89 పాకిస్థాన్ రూపాయలు
కిలో బియ్యం: 339.56 పాకిస్థాన్ రూపాయలు
డజను గుడ్లు: 332 పాకిస్థాన్ రూపాయలు
లీటర్ పాలు: 224 పాకిస్థాన్ రూపాయలు
అరకిలో బ్రెడ్: 161.28 పాకిస్థాన్ రూపాయలు
కిలో టమాట: 150 పాకిస్థాన్ రూపాయలు
కిలో బంగాళాదుంప: 105 పాకిస్థాన్ రూపాయలు
అరటిపండ్లు కిలో : 176 పాకిస్థాన్ రూపాయలు
ఆరెంజ్‌ కిలో : 216 పాకిస్థాన్ రూపాయలు

READ MORE: Pakistan: భారత్తో వైరం వద్దు.. పరిష్కారం వెతకండి.. పాక్‌ ప్రధానికి సోదరుడి సూచన

గత ఆర్థిక సంవత్సరంలో భారత్-పాక్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ రూ. 3838.53 కోట్లుగా నమోదైంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు అట్టారీ-వాఘా సరిహద్దు కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ఆ మార్గం పూర్తిగా మూసివేయడంతో పాకిస్తాన్‌కు తక్షణ నష్టమే కాదు, దీర్ఘకాలికంగా ఆర్థికంగా మరింత దిగజారే ప్రమాదం తలెత్తింది.

Exit mobile version