NTV Telugu Site icon

Natu Natu Song: ’నాటు నాటు‘ సాంగ్ పై హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్

Rrr

Rrr

Natu Natu Song : దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లుగొడుతోంది. ఇటీవలే ఆ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని ఆ పాట మనవాళ్లతోనే కాకుండా విదేశీయులతో కూడా స్పెప్పులేపిస్తోంది. అంతలా ఈ పాట క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ఇప్పటికే ఎంతో మంది నాటు నాటు పాటకు రీల్స్ చేస్తూ తెగ హడావిడి చేశారు. తాజాగా ఈ పాటకు పాకిస్థాన్ ప్రముఖ నటి హనియా ఆమీర్ డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Meta: అమెరికాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ పెయిడ్ వెరిఫికేషన్ ప్రారంభం..

పాక్ నటి హనియా ఆమీర్ ఓ పెళ్లి ఫంక్షన్‌లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసింది. నాటు నాటు హిందీ వెర్షన్ నాచో నాచో సాంగ్‌కు స్టెప్పులేసింది. ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సైతం భలేగా డ్యాన్స్ చేసిందంటూ తమ కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వారే కాకుండా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా(Harsha Goenka) సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ‘పాకిస్థాన్‌లో ఏ పాట క్రేజ్‌గా మారుతుందో ఊహించండి!’ అంటూ ట్వీట్ చేశారు.

Read Also: NEET: ఏడాదికి రెండుసార్లు నీట్ ఎగ్జామ్.. కేంద్రం మంత్రి క్లారిటీ..

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన అలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.