Pakistan Women’s World Cup 2025 Squad Announced: 2025 మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం ప్రకటించింది. పాక్ జట్టుకు సీనియర్ ప్లేయర్ ఫాతిమా సనా కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ జట్టు సారథిగా వ్యవహరించడం సనాకు ఇదే తొలిసారి కావడం విశేషం. సనాకు డిప్యూటీగా మునీబా అలీ ఎంపికయ్యారు. డయానా బేగ్, ఒమైమా సోహైల్ లాంటి సీనియర్ ప్లేయర్లకు చోటు దక్కింది. జట్టులో ఐదుగురు ట్రావెలింగ్ రిజర్వ్‌లు ఉన్నారు.
మహిళల ప్రపంచకప్ కోసం ఇరవై ఏళ్ల ఐమాన్ ఫాతిమాను పీసీబీ ఎంపిక చేసింది. ఆమె వన్డేలకు ఎంపికవడం ఇదే మొదటిసారి. ఐమాన్‌తో పాటు మరో ఆరుగురు క్రీడాకారిణులు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్, సయ్యదా అరూబ్ షా మొదటిసారి మెగా టోర్నీ ఆడనున్నారు. ప్రపంచకప్ ఆడడం ఏడుగురు ప్లేయర్స్‌కు ఇదే మొదటిసారి. దాంతో పాక్ జట్టుపై ట్రోలింగ్ మొదలైంది. ఈ జట్టుతో ‘కప్ గెలుస్తారా భయ్యా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Viral Video: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి జీపుతో యువకులు.. చివరికి ఏమైందంటే?
భారత్, శ్రీలంక వేదికలుగా మహిళల వన్డే ప్రపంచకప్ 2025 జరగనుంది. పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్‌లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. భారత్ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 30న గౌహతిలో శ్రీలంకతో ఆడనుంది. ఆక్టోబర్ 5న కొలంబోలో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు లాహోర్‌లో జరుగుతుంది. ప్రపంచకప్‌లో ఆడాల్సిన పాకిస్తాన్ ప్లేయర్స్ ఈ సిరీస్‌లో ఆడనున్నారు.
పాకిస్తాన్ జట్టు:
ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఎమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సొహైల్, రమీన్ షమీ, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్, సిద్రా అమిన్, అరూబ్ షా.
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: గుల్ ఫిరోజా, నజిహా అల్వీ, తుబా హసన్, ఉమ్-ఎ-హని మరియు వహీదా అక్తర్.