Site icon NTV Telugu

S Jaishankar: ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదు.. పాక్‌పై విదేశాంగ మంత్రి మండిపాటు

S Jaishankar

S Jaishankar

S Jaishankar: పాకిస్థాన్‌ ఒక పరిశ్రమగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద సమస్యను విస్మరించడానికి భారత్‌ ఏమాత్రం అనుకూలంగా లేదని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ శనివారం అన్నారు. సింగపూర్‌లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన జైశంకర్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ (ఐఎస్‌ఏఎస్)లో తన పుస్తకం ‘వై ఇండియా మేటర్స్’పై జరిగిన లెక్చర్ సెషన్ తర్వాత జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో భారత్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ప్రతి దేశం సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుందని.. గత్యంతరం లేక కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైన ఉండాలి. దురదృష్టవశాత్తూ ఇది భారతదేశం విషయంలో అలా లేదన్నారు.

Read Also: INDIA Bloc: కూటమిలో మరో చీలిక.. అభ్యర్థుల్ని ప్రకటించేసిన ఆర్జేడీ

విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఒక పరిశ్రమ స్థాయిలో పాక్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితిలో భారత్‌ లేదు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాలి. దానినుంచి తప్పించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేకపోగా.. తిరిగి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి దేశమూ ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుంది. అదీ కాకపోతే, కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా ఉండాలని ఆశిస్తుంది. పాక్‌తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలేయలేం’’ అని జైశంకర్ అన్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని.. ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదని భారత్ వైఖరిని జైశంకర్ చెప్పుకొచ్చారు.

Read Also: Asia’s Largest Tulip Garden: తెరుచుకున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!

అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా వాదన అసంబద్ధం: జైశంకర్
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా పదే పదే చేస్తున్న వాదనలు అసంబద్ధం అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొట్టిపారేశారు. ఈ సరిహద్దు రాష్ట్రం భారతదేశంలో సహజ భాగమని ఆయన అన్నారు. అరుణాచల్‌పై చైనా తరచుగా చేస్తున్న వాదనలు, ఆ రాష్ట్రానికి భారత రాజకీయ నాయకులు సందర్శనలు చేయడంపై చైనా వ్యతిరేకతపై బహుశా తన మొదటి బహిరంగ వ్యాఖ్యలో జైశంకర్.. ఇది కొత్త విషయం కాదని అన్నారు. చైనా-భారత్‌ సరిహద్దులోని తవాంగ్‌కు సైనిక బలగాలను తరలించేందుకు ఉపయోగపడే సేలా సొరంగ మార్గాన్ని ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించగా.. అది తమ భూభాగమని చైనా నోరు పారేసుకుంది. ఈ వ్యవహారం జైశంకర్ మాట్లాడుతూ.. ఆ వాదన హాస్యాస్పదమని అరుణాచల్ ప్రదేశ్‌ దేశంలో సహజ భూభాగమని తేల్చి చెప్పారు.

Exit mobile version