ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వం కోసం గురువారం జరిగిన రహస్య బ్యాలట్‌లో పాకిస్థాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు విజయం సాధించాయి. 193 సభ్య దేశాలు గల ఐరాస జనరల్ అసెంబ్లీ ఈ అయిదు దేశాలను ఎంపిక చేయడం లాంఛనమే అయింది. భద్రతా మండలిలో మొత్తం 15 సీట్లు ఉండగా.. వాటిలో అయిదు వీటో అధికారం గల శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి. మిగతా 10 దేశాలను రెండేళ్ల పాటు తాత్కాలిక సభ్యులుగా ఎన్నిక చేయనున్నారు. ఈ సీట్లను ప్రాంతాల వారీగా కేటాయిస్తారు.
Read Also: TGSRTC: ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బస్ పాస్ ధరలు
ఇక, ఈసారి ఆఫ్రికా బృందం సోమాలియాను ప్రతిపాదించగా.. ఆసియా-పసిఫిక్ దేశాల తరఫున పాకిస్థాన్‌ను ఎంపిక చేశారు. లాటిన్ అమెరికా, కరేబియన్ గ్రూపు పనామా పేరును ప్రతిపాదించగా.. డెన్మార్క్, గ్రీస్‌లు ఐరోపా తరఫున నామినేట్ అయ్యాయి. ఈ కొత్త తాత్కాలిక సభ్య దేశాల పదవీకాలం 2025 జనవరి 1వ లేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. కాగా, ప్రస్తుత తాత్కాలిక సభ్య దేశాలు జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్‌ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన ముగియనుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని 21వ శతాబ్ది అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా విస్తరించాలని భారత్‌తో సహా అన్ని సమితి సభ్య దేశాలు కోరుతున్నా ఇంత వరకు అడుగు ముందుకు మాత్రం పడటం లేదు.
Read Also: Gopal Rai: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. ఆప్ మంత్రి స్పష్టం
ఇక, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యు దేశంగా ఎన్నికైనందుకు సంతోషం వ్యక్తం చేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇది గర్వించదగ్గ క్షణమని పేర్కొన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేసేందుకు పాకిస్థాన్ ఆసక్తిగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచ దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, సహకారాన్ని పెంపొందించడంలో మేము మా పాత్రను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ తెలిపారు.
