TGSRTC: ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బస్ పాస్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC: హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.జిహెచ్ఎంసీ పరిధిలో ఏసీ బస్సు పాస్ ఛార్జీలను టీజీఎస్ ఆర్టీసీ తగ్గించినట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధర 2530 రూపాయలు ఉండగా.. ప్రయాణికుల కోసం రూ.1900 కే అందిస్తుంది. అంటే రూ.630 కు బస్ పాస్‌ను ఆర్టీసీ సంస్థ తగ్గించింది. కాగా.. సికింద్రాబాద్ – పటాన్ చెరువు (219 రూట్), బాచుపల్లి – వేవ్ రాక్(195 రూట్) మార్గాల్లో నడిచే గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ బస్‌పాస్‌తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ-మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించినుంది. ఎయిర్‌పోర్ట్ మార్గంలో నడిచే పుష్ఫక్ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చని తెలిపింది. హైదరాబాద్‌లోని టీజీఎస్ ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.
Read also: Mallu Bhatti Vikramarka: నేడు వివిధ శాఖలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ…
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
అధిక చార్జీల కారణంగా నగరంలో ఏసీ బస్సుల్లో ప్రయాణం హాట్ హాట్ గా మారింది. ఏసీ బస్సుల్లో చార్జీలు అధికంగా ఉండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మెట్రో రైళ్ల కంటే ఏసీ బస్సుల ధర ఎక్కువగా ఉండటంతో ప్రజలు ప్రయాణానికి ఆసక్తి చూపడం లేదు. గతంలో వేవ్‌రాక్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే బస్సులో ఉదయం, సాయంత్రం వేళల్లో ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రయాణించేవారు. రాయదుర్గం వరకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏసీ బస్సు చార్జీలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. వేవరాక్, గచ్చిబౌలి, కొండాపూర్ వైపు వచ్చే ఏసీ బస్సులను కూడా గణనీయంగా తగ్గించారు. అయితే ఏసీ బస్సుల అధిక చార్జీలను తగ్గిస్తే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, నగరంలో ఏసీ బస్సులకు ఆదరణ పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు గుర్తించినా ఛార్జీల తగ్గింపు ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. అయితే దీనిపై దృష్టిపెట్టిన టీజీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల జార్జీలను భారీగా తగ్గించింది. ప్రయాణికులు సులువుగా జర్నీ చేసేందుకు అవకాశం కల్పించనుంది. టీజీఎస్ ఆర్టసీ నిర్ణయంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Kajal Aggarwal : ‘సత్యభామ’ లో ఆ సీన్స్ కోసం ఎంతో కష్టపడ్డా..
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!