Pakistan Debt Crisis: పేదరికంలో నయా రికార్డు..! పాకిస్థాన్‌ను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న షాబాజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Debt Crisis: దాయాది దేశం పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే అపవాదును ప్రతీసారి ఎదుర్కుంటున్న పాక్‌లో పూర్తిగా పారిశ్రామిక వృద్ధి నిలిచిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పతాక స్థాయికి పడిపోయాయి. దీంతో పాకిస్థాన్ పేదరికంలో కొత్త రికార్డును సృష్టిస్తోంది. షాబాద్ ప్రధాని అయ్యాక ఆ దేశం పరిస్థితి మరింత దిగజారింది. జూన్ 2025 నాటికి పాకిస్థాన్ మొత్తం ప్రజా రుణం US$286.832 బిలియన్లకు (సుమారు 80.6 ట్రిలియన్ పాకిస్థానీ రూపాయలు) పెరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 13 శాతం పెరిగిందని అధికారిక డేటా వెల్లడించింది. తాజాగా పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2025 ఆర్థిక ఏడాది వార్షిక రుణ సమీక్ష ప్రకారం.. జూన్ 2025 చివరి నాటికి, పాకిస్థాన్ మొత్తం ప్రజా అప్పు రూ. 80.6 ట్రిలియన్లకు చేరుకుంది. ఇందులో దేశీయ అప్పు రూ. 54.5 ట్రిలియన్లు, బాహ్య అప్పు రూ. 26.0 ట్రిలియన్లు ఉన్నాయి.
READ MORE: Golden Cobra: బంగారు వర్ణంలో నాగుపాము.. నాగులపంచమి రోజే కనిపించడంతో.
Also Read
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
- Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్‌లైన్..
జూన్ 2024లో 68 శాతంతో పోలిస్తే, జూన్ 2025లో రుణం-జీడీపీ నిష్పత్తి దాదాపు 70 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల ప్రధానంగా 2025లో ఊహించిన దానికంటే తక్కువ జీడీపీ వృద్ధి నమోదైందని.. దీని కారణంగా అప్పు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక విస్తరణ మందగించిందని తెలిపింది. దేశీయ అప్పులు గత ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరిగి 54.5 ట్రిలియన్ రూపాయలకు చేరుకున్నాయని, ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో అత్యల్ప వార్షిక పెరుగుదల అని నివేదిక పేర్కొంది. ఇంతలో బాహ్య అప్పులు జూన్ 2025 నాటికి 6 శాతం పెరిగి US$91.8 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది ప్రధానంగా IMF నుంచి నిధులు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) హామీ ఇచ్చిన $1 బిలియన్ వాణిజ్య రుణం, ఇతర బహుపాక్షిక సంస్థల నుంచి వచ్చే నిధుల కారణంగా జరిగింది.
READ MORE: Delhi official Logo: ఢిల్లీకి మొదటిసారిగా అధికారిక లోగో.. నవంబర్ 1న ఆవిష్కరణ
తాజావార్తలు
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్‌గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..