Site icon NTV Telugu

Pakistan: ‘‘మా ప్రధాని పిరికివాడు, మోడీ అంటే వణుకు’’.. షహబాజ్ షరీఫ్‌పై సొంత ఎంపీల ఆగ్రహం..

Pm Shahbaz Sharif

Pm Shahbaz Sharif

Pakistan: ‘‘ఆపరేషన్ సింధూర్’’ దెబ్బ పాకిస్తాన్‌కి బాగా తగినట్లు ఉంది. అయితే, ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మాత్రం భారత్ దాడి వల్ల నష్టపోయామని ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, తన ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత గురువారం సాయంత్రం సమయంలో పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాలపై దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడుల్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకుని, పాకిస్తాన్‌పై రాత్రి భారత త్రివిధ దళాలు భీకరంగా దాడి చేశాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ సహా ప్రధాన నగరాల్లో బాంబుల మోత మోగింది.

Read Also: Naga Vamsi: ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నోడితో సినిమా ఎలా చేస్తానో అనుకున్నా!

ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ఎంపీ ప్రధాని షహబాజ్ షరీఫ్‌పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం నిజాలు దాచిపెడుతున్నప్పటికీ, ఎంపీ మాటలు వింటే పాకిస్తాన్ చాలా నష్టపోయినట్లు తెలుస్తోంది. పాక్ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై కూడా విరుచుకుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పాకిస్తాన్ నాయకత్వాన్ని నక్కతో పోల్చాడు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిరికివాడని, భారత ప్రధాని మోడీ పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నాడని అన్నారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ని ఉద్దేశిస్తూ, పాకిస్తాన్ ఆర్మీని సింహం కాదు, తోడేలు నడిపిస్తోందని, పాక్ దళాలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Exit mobile version