Kamran Ghulam: ఛీ.. ఛీ.. మరి ఇంత దిగజారాలా? బండ బూతులతో రెచ్చిపోయిన పాకిస్థాన్ క్రికెటర్
- నోటిదూల ప్రదర్శించిన పాక్ ఆటగాడు..
- అసభ్య ప్రవర్తనతో రెచ్చిపోయిన పాకిస్థాన్ క్రికెటర్ కమ్రాన్ గులాం
- సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamran Ghulam: క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టు ప్రత్యేకమైన విధానం కలిగి ఉంటుందని అనడంలో ఎతువంటి అతిశయోక్తి లేదు. ఆటలోనే కాదు, ఆటగాళ్ల ప్రవర్తనలోనూ పాక్ జట్టు ఎప్పటికప్పుడు వివాదాల కేంద్రంగా నిలుస్తోంది. ప్రత్యర్థి జట్లతో స్లెడ్జింగ్ చేయడం, నోటిదూల ప్రదర్శించడం లాంటివి పాక్ ప్లేయర్లకు కొత్తేమీ కాదు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ కమ్రాన్ గులాం తన అసభ్య ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నేడు సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ సమయంలో పాక్ ఆటగాడు కమ్రాన్ గులాం తన నోటిదూలతో వివాదానికి దారి తీశాడు. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడా, యువ ఆటగాడు వెర్రీన్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మొదట రబాడపై అసభ్య పదజాలం వాడినా.. రబాడ దానిని లైట్‌గా తీసుకున్నాడు. కానీ వెర్రీన్ మాత్రం ఈ వ్యవహారాన్ని అక్కడే వదిలిపెట్టలేదు.
Also Read: Veg vs Non veg: వెజ్ లేదా నాన్ వెజ్.. ఏ ఆహారం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందంటే?
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
https://twitter.com/MarkramBot/status/1872244694652211667
కమ్రాన్ గులాం అసభ్య పదజాలాన్ని వాడడంతో, వెర్రీన్ క్రమాన్‌ను ఎదిరించాడు. “దమ్ముంటే మళ్లీ ఆ మాట చెప్పు” అంటూ పాక్ బ్యాటర్‌ను సవాల్ చేశాడు. అయితే.. కమ్రాన్ మళ్లీ అదే అసభ్య పదజాలాన్ని వాడి, సౌతాఫ్రికా ఆటగాడి ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఘటన అనంతరం వెర్రీన్ అతనిపై ఫైర్ అయ్యాడు. చివరికి గులాం “వెళ్లు” అని అనగా, వెర్రీన్ కూడా ఏదో వ్యాఖ్య చేస్తూ తన ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు పాక్ ఆటగాడి ప్రవర్తనపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సంఘటన పాక్ క్రికెట్ జట్టు ప్రవర్తనపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తించింది. ఆటలో మంచి ప్రదర్శన ఇవ్వడం పక్కనపెట్టి, ఇలాంటి వివాదాలకు కారణమవడం పాక్ క్రికెట్‌కు చెడ్డపేరు తెస్తోంది. క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనపై కఠిన నియమాలు తీసుకురావాలని నెటిజన్లు కోరుతున్నారు. “క్రికెట్ అంటే జెంటిల్మన్ గేమ్ అని, కానీ పాక్ ఆటగాళ్లు ఈ ఆటకు అవమానం తెస్తున్నారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!