Pakistan Suicide Bomb Attack: పాకిస్థాన్‌లో మజీద్‌ను మేమే పేల్చేశాం.. ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Suicide Bomb Attack: పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ను భయంతో కుదిపేసిన ఘోర ఘటన ఇది. శుక్రవారం నమాజ్ సమయంలో షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 169 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాద సంస్థ ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇస్లామాబాద్ శివారులోని తర్లాయి ప్రాంతంలో ఉన్న ఇమామ్ బర్గాహ్ ఖస్ర్-ఎ-ఖదీజతుల్ కుబ్రా మసీదులో ఈ పేలుడు జరిగింది. శుక్రవారం కావడంతో మసీదు నిండా జనాలు కిక్కిరిసిపోయారు. ప్రార్థనలు మొదలవుతున్న సమయంలోనే దుండగుడు మసీదు గేటు దగ్గర ఆత్మాహుతి పేలుడుకు పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది అతడిని ఆపే ప్రయత్నం చేసిన తరుణంలో తన శరీరానికి కట్టుకున్న బాంబును పేల్చేశాడు.
READ MORE: NBK : బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం.. బారులు తీరిన నలుగురు స్టార్ దర్శకులు..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం మసీదులోని జనాలు శబ్దంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై 52 ఏళ్ల మహమ్మద్ కాజిమ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. “నమాజ్ మొదటి భాగంలో వంగుతున్న సమయంలో తుపాకీ శబ్దం వినిపించింది. ఆ వెంటనే భయంకరమైన పేలుడు జరిగింది” అని చెప్పాడు. మరో వ్యక్తి ఇమ్రాన్ మహ్మూద్ మాట్లాడుతూ.. దుండగుడికి, అక్కడున్న భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయని వెల్లడించాడు. ఒక వాలంటీర్ అతడిని కాలిలో కాల్చిన తర్వాతే అతడు పేలుడు జరిపాడని అన్నాడు. పేలుడు తర్వాత పరిస్థితి అత్యంత విషాదంగా మారింది. ఆసుపత్రుల్లో రక్తంతో తడిసిన బట్టలతో గాయపడినవారిని స్ట్రెచర్లపై తీసుకొచ్చారు. కొందరిని చేతుల్లో, మరికొందరిని కార్లలో తీసుకొచ్చారు. ఒక బాధితుడిని కారు డిక్కీలో తీసుకొచ్చిన దృశ్యం అందరినీ కలిచివేసింది. ఆసుపత్రి బయట బంధువులు ఏడుస్తూ కేకలు వేస్తూ కనిపించారు.
ఈ ఘటన అనంతరం మసీదు చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. నేలపై రక్తపు మరకలు, చెప్పులు, విరిగిన అద్దాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో మసీదు గేటు దగ్గర శవాలు పడి ఉన్నట్లు కనిపించింది. అయితే వాటిని అధికారికంగా నిర్ధారించలేదు. ఈ దాడిపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. దాడి చేసినవారిని వదిలిపెట్టబోమని, తప్పక శిక్షిస్తామని చెప్పారు. ఉప ప్రధాని ఇషాక్ దార్ ఈ ఘటనను “మానవత్వంపై జరిగిన ఘోర నేరం”గా పేర్కొన్నారు. ఇలాంటి దాడులు ఇస్లాం సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం పౌరులపై, ప్రార్థనా స్థలాలపై దాడులు అంగీకరించలేమని అన్నారు.
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!