Pakistan Hockey Team: నడిరోడ్డుపై పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాలో పాక్ ఆటగాళ్లకు ఘోర అవమానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Hockey Team: పాకిస్థాన్ జాతీయ క్రీడ అయిన హాకీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చాటిచెప్పేలా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కొన్ని చేదు సంఘటనలు చోటుచేసుకున్నాయి. క్రీడాకారులు దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆడుతుంటే, పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHF) వారిని నడిరోడ్డుపై నిలబెట్టిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్ లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్నాక మీడియా ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు.
READ ALSO: Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ను చంపేందుకు అసిమ్ మునీర్ ప్లాన్..
Also Read
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ మాట్లాడుతూ.. మ్యాచ్‌లు ఆడాల్సిన ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో వంటగదిని శుభ్రం చేయడం, పాత్రలు కడగడం వంటి పనులు చేయాల్సి వచ్చింది. “ఇలాంటి పరిస్థితుల్లో మా నుంచి మెరుగైన ప్రదర్శన ఎలా ఆశించగలరు?” అని కెప్టెన్ సూటిగా ప్రశ్నించారు. సిడ్నీ విమానాశ్రయంలో సుమారు 14 గంటల పాటు జట్టు నిరీక్షించాల్సి వచ్చింది. హోటల్‌కు వెళ్తే.. ఫెడరేషన్ ముందుగా డబ్బులు చెల్లించకపోవడంతో బుకింగ్‌లు రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లు గంటల తరబడి వీధుల్లో తిరగాల్సి వచ్చింది. ఆటగాళ్లు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నిధుల దుర్వినియోగం జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. హోటల్ వసతి, ఇతర ఖర్చుల కోసం పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డు (PSB) ఏకంగా 10 మిలియన్లకు పైగా పాకిస్థానీ రూపాయలను ఫెడరేషన్‌కు విడుదల చేసింది. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ, ఫెడరేషన్ వాటిని సక్రమంగా వినియోగించలేదని తెలుస్తుంది. కేవలం 10 రోజులకు సరిపడా Airbnb బుకింగ్స్ మాత్రమే చేశారని, మిగిలిన 3 రోజులు ఆటగాళ్లు తక్కువ సౌకర్యాలు ఉన్న చౌక హోటళ్లకు మారాల్సి వచ్చిందని సమాచారం. చివరికి స్థానిక పాకిస్థానీ ప్రజలు ఆదుకోవడంతో ఆటగాళ్లకు నిలువ నీడ దొరికిందని చెబుతున్నారు.
మానసిక ప్రశాంతత లేని పరిస్థితుల్లో ఆడిన పాకిస్థాన్ జట్టు, ఆస్ట్రేలియా, జర్మనీలతో జరిగిన మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడిపోయింది. మైదానం వెలుపల జరిగిన గందరగోళం ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సీరియస్ అయ్యారని సమాచారం. నిధులు ఏమయ్యాయి? ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే కోణంలో ఇప్పటికే ఆయన దర్యాప్తుకు ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. “మేము ఇక ఇలాంటి ఫెడరేషన్ కింద ఆడలేము” అని కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ హాకీ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి.
READ ALSO: ICC-India: భారత్‌కు బిగ్ షాక్.. ఇకపై ఐసీసీ టోర్నీలు ఇండియాలో లేనట్టే?
తాజావార్తలు
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!