Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Faces Medicine Shortage Risk After Suspension Of Trade With India

Pakistan vs India : భారత్ ఔషధాల ఎగుమతి నిలిపేస్తే పాకిస్థాన్‌ పరిస్థితి అంతే?

Published Date :April 27, 2025 , 10:52 am
By RAMAKRISHNA KENCHE
  • పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతిస్పందన
  • పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలు నిలిపివేత
  • దీంతో పాకిస్థాన్‌లో మందుల కొరత
  • నివారించేందుక చర్యలు తీసుకుంటున్న పాక్
Pakistan vs India : భారత్ ఔషధాల ఎగుమతి నిలిపేస్తే పాకిస్థాన్‌ పరిస్థితి అంతే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌లో మందుల కొరత లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. మరోవైపు.. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్‌ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా.. ఇస్లామాబాద్ కూడా న్యూఢిల్లీతో అన్ని వాణిజ్యాలను నిలిపివేసింది. కానీ ఔషధాల దిగుమతుల అంశంపై మాత్రం ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఎందుకంటే పాకిస్థాన్ భారత్ నుంచి వచ్చే మందులుపై ఆధారపడుతోంది.

READ MORE: Sourav Ganguly-PCB: రంగంలోకి సౌరవ్ గంగూలీ.. ఇక పీసీబీ అడుక్కు తినాల్సిందే!

భారతదేశంతో వాణిజ్యం నిలిచిపోయినందున.. పాకిస్థాన్‌లో ఔషధ అవసరాలను తీర్చడానికి తక్షణ చర్యలు ప్రారంభించామని, ఆరోగ్య అధికారులు సరఫరాలను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారని జియో న్యూస్ నివేదించింది. భారత్‌ నుంచి వచ్చే ఔషధాలపై నిషేధం గురించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ జారీ చేయలేదని.. ఒకవేళ నిషేధిస్తే.. అత్యవసర ప్రణాళిక ఇప్పటికే సిద్ధంగా ఉందని పాకిస్థాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ (DRAP) తెలిపింది.

READ MORE: Naga Chaitanya : నా మూవీలో నాగచైతన్య లేరు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!

2019 సంక్షోభం తర్వాత.. తాము అలాంటి పరిస్థితులకు ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీఆర్ఏపీ సీనియర్ తెలిపారు. ఔషధ అవసరాలను తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం, పాకిస్థాన్ ఔషధ పరిశ్రమ దాని ముడి పదార్థాలలో 30% నుంచి 40% వరకు భారతదేశంపై ఆధారపడి ఉంది. వీటిలో క్రియాశీల ఔషధ పదార్థాలు (API), వివిధ అధునాతన వైద్య ఉత్పత్తులు ఉన్నాయి.

READ MORE: PM Modi AP Tour: 15 నిమిషాలు రోడ్డు షో.. గంట పాటు సభ!

పాకిస్థాన్ ఔషధ అవసరాలను తీర్చడానికి చైనా, రష్యా, అనేక యూరోపియన్ దేశాల నుంచి ప్రత్యామ్నాయ వనరుల కోసం వెతుకుతోంది. అందులో యాంటీ-రాబిస్ వ్యాక్సిన్లు, యాంటీ-స్నేక్ వినం, క్యాన్సర్ చికిత్సలు, మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇతర కీలకమైన జీవ ఉత్పత్తులు ఉన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉందని చెబుతున్నప్పటికీ.. భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేయడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి తక్షణ చర్య తీసుకోకపోతే.. పెద్ద సవాలు తలెత్తవచ్చని ఔషధ పరిశ్రమ వర్గాలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.

READ MORE: PM Modi AP Tour: 15 నిమిషాలు రోడ్డు షో.. గంట పాటు సభ!

“పాకిస్తాన్ మందుల కోసం 30-40% ముడి పదార్థాలను భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, టీకాలు, సీరమ్‌లు, రాబిస్ నిరోధక వ్యాక్సిన్, పాము విష నిరోధకాలను దిగుమతి చేసుకుంటాం. భారత్‌తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. కానీ.. ఔషధ దిగుమతుల స్థితిని స్పష్టం చేస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇంకా ఎటువంటి అధికారిక సూచనలు అందలేదు. ఇది నిలిపి వేస్తే.. తీవ్రమైన ఔషధాల కొరతకు దారితీయవచ్చని ఔషధ పరిశ్రమ భయపడుతోంది.” అని పాకిస్థాన్ ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • API Imports
  • DRAP
  • Health Ministry Pakistan
  • Healthcare Emergency
  • india

తాజావార్తలు

  • Aditya Dhar: లెజెండ్ ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా.. “ధురంధర్” డైరెక్టర్ ఆదిత్యధర్

  • LSG’s Talent Hunt: ముకుల్, మయాంక్, ప్రిన్స్, దిగ్వేశ్.. ఈ కొత్త టాలెంట్‌ను లక్నో ఎలా పడుతుందయ్యా!

  • US: ‘‘మాతో గేమ్స్ వద్దు’’.. ఇరాన్‌కు జేడీ వాన్స్ వార్నింగ్..

  • Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి

  • Fire Break: గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions