Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌కు శ్రీలంక బిగ్ షాక్.. మ్యాచ్‌కు ముందే సెమీస్ రేసు నుంచి పాక్ అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka vs Pakistan: పాకిస్థాన్ పని అయిపోయింది. శ్రీలంకతో పాటు పాకిస్థాన్ ఇంటి బాట పట్టింది. శనివారం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతోంది. అయితే, మ్యాచ్ తుది ఫలితం రాకముందే పాకిస్థాన్ సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. పాకిస్థాన్ శ్రీలంకకు 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకవేళ పాకిస్థాన్ బౌలర్లు శ్రీలంకను 147 పరుగులకే పరిమితం చేసి ఉంటే, సెమీ-ఫైనల్‌కు చేరుకునేది. అయితే, శ్రీలంక 16వ ఓవర్లో 147 మార్కును ఇప్పటికే దాటింది. శ్రీలంక బ్యాటింగ్ ఇంకా కొనసాగుతోంది. 16.2 ఓవర్ల వద్ద శ్రీలంక స్కోర్ 157 పరుగులకు చేరుకుంది. గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక రెండో స్థానం బరిలో న్యూజిలాండ్ (+1.390 NRR) తో పాకిస్థాన్ (-0.461 NRR) పోటీ పడుతోంది. కివీస్‌ను వెనక్కి నెట్టాలంటే లంకపై పాక్ ఒక భారీ మిరాకిల్ చేయాల్సి ఉండేది. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 64 పరుగుల తేడాతో విజయం సాధించాలి. కానీ.. ఇక్కడ అది సాధ్యం కాలేదు. మరోవైపు.. 213 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక పేలవంగా ఆడింది. నసీమ్ షా వేసిన రెండో ఓవర్లోనే పాతుమ్ నిస్సాంక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శ్రీలంక 33 పరుగుల వద్ద రెండో ఎదురుదెబ్బను చవిచూసింది. ఆ తర్వాత చరిత్ అసలంకా బాగా బ్యాటింగ్ చేసి, స్కోరును 75 పరుగులకు చేర్చి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శ్రీలంక 94 పరుగుల వద్ద నాలుగో ఎదురుదెబ్బను, 101 పరుగుల వద్ద ఐదో ఎదురుదెబ్బను చవిచూసింది. ఎట్టకేలకు శ్రీలంక తనతో పాటు పాకిస్థాన్‌ను సైతం ఇంటికి తీసుకెళ్లింది.
READ MORE: ONGC Share: ఇరాన్- ఇజ్రాయెల్ చమురు మంటలతో.. ONGC ఇన్వెస్టర్లకు పండగ?
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?