Site icon NTV Telugu

Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌కు శ్రీలంక బిగ్ షాక్.. మ్యాచ్‌కు ముందే సెమీస్ రేసు నుంచి పాక్ అవుట్

Pakistan

Pakistan

Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌ పని అయిపోయింది. శ్రీలంకతో పాటు పాకిస్థాన్ ఇంటి బాట పట్టింది. శనివారం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతోంది. అయితే, మ్యాచ్ తుది ఫలితం రాకముందే పాకిస్థాన్ సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. పాకిస్థాన్ శ్రీలంకకు 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకవేళ పాకిస్థాన్ బౌలర్లు శ్రీలంకను 147 పరుగులకే పరిమితం చేసి ఉంటే, సెమీ-ఫైనల్‌కు చేరుకునేది. అయితే, శ్రీలంక 16వ ఓవర్‌లో 147 మార్కును ఇప్పటికే దాటింది. శ్రీలంక బ్యాటింగ్ ఇంకా కొనసాగుతోంది. 16.2 ఓవర్ల వద్ద శ్రీలంక స్కోర్ 157 పరుగులకు చేరుకుంది. గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక రెండో స్థానం బరిలో న్యూజిలాండ్ (+1.390 NRR) తో పాకిస్థాన్ (-0.461 NRR) పోటీ పడుతోంది. కివీస్‌ను వెనక్కి నెట్టాలంటే లంకపై పాక్ ఒక భారీ మిరాకిల్ చేయాల్సి ఉండేది. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 64 పరుగుల తేడాతో విజయం సాధించాలి. కానీ.. ఇక్కడ అది సాధ్యం కాలేదు. మరోవైపు.. 213 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక పేలవంగా ఆడింది. నసీమ్ షా వేసిన రెండో ఓవర్లోనే పాతుమ్ నిస్సాంక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శ్రీలంక 33 పరుగుల వద్ద రెండో ఎదురుదెబ్బను చవిచూసింది. ఆ తర్వాత చరిత్ అసలంకా బాగా బ్యాటింగ్ చేసి, స్కోరును 75 పరుగులకు చేర్చి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శ్రీలంక 94 పరుగుల వద్ద నాలుగో ఎదురుదెబ్బను, 101 పరుగుల వద్ద ఐదో ఎదురుదెబ్బను చవిచూసింది. ఎట్టకేలకు శ్రీలంక తనతో పాటు పాకిస్థాన్‌ను సైతం ఇంటికి తీసుకెళ్లింది.

READ MORE: ONGC Share: ఇరాన్‌- ఇజ్రాయెల్ చమురు మంటలతో.. ONGC ఇన్వెస్టర్లకు పండగ?

Exit mobile version