Site icon NTV Telugu

Chicken Theft : పాక్‎లో ఆకలి తట్టుకోలేక కోళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు.. లబోదిబోమంటున్న యజమాని

Chicken Theft

Chicken Theft

Chicken Theft : పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజలకు రెండు పూటలా రొట్టెలు దొరకడం కూడా కష్టంగా మారుతోంది. ఆకలి చావులతో పోరాడుతున్న పాకిస్థాన్‌లో దోపిడీలు మొదలయ్యాయి. పాకిస్తాన్‌లో, ప్రజలకు గోధుమ పిండి లభించక, ప్రజలు కోళ్లను దొంగిలించడం ప్రారంభించారు. పాకిస్తాన్ మీడియా ప్రకారం, రావల్పిండిలో చాలా మంది వ్యక్తులు ఆయుధాలతో పౌల్ట్రీ ఫామ్‌లో దోపిడీకి పాల్పడ్డారు.

Read Also: Ys Jaganmohan Reddy: వినుకొండలో నేడు జగన్ పర్యటన.. చేదోడు పథకం ప్రారంభం

పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగిన తరువాత, ప్రజలు ఇప్పుడు దోచుకోవడం ప్రారంభించారు. పాకిస్థాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండి నుంచి కోళ్లను దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్ తెర వెనుక ఉండి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. 12 మంది ఆయుధాలతో వచ్చిన వ్యక్తులు ముందుగా పౌల్ట్రీ ఫారమ్ కార్మికులను బందీలు చేసి సుమారు 5000 కోళ్లను దోచుకుని పారిపోయారు. ఈ కోళ్ల ధర దాదాపు 30 లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. పౌల్ట్రీ ఫామ్ యజమాని వకాస్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో పది మంది వ్యక్తులు వచ్చి ఆయుధాలతో వచ్చి కోళ్లను దోచుకున్నారని పేర్కొన్నారు. పౌల్ట్రీ ఫామ్‌లోని కార్మికులను వాష్‌రూమ్‌లో బంధించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అనంతరం కోళ్లను లారీలో ఎక్కించుకుని పారిపోయారు.

Read Also: Sharukh Khan: బాల్కనీ కొచ్చిన బాలీవుడ్ బాద్ షా.. ఫ్యాన్స్‎ను చూసి డ్యాన్స్

పాకిస్థాన్‌లో పెరుగుతున్న సమస్య
నేడు పాకిస్థాన్ కరెన్సీ పతనమైంది. పాకిస్థాన్ ప్రజలు కోట్లాది మందికి రోజువారీ తిండి లేకుండా పోయింది. చాలా కుటుంబాలు కనీసం కూరగాయలకు కూడా డబ్బుల్లేవు. అటువంటి పరిస్థితిలో తమను తాము బ్రతికించుకోవడానికి ఇలా దోపిడీ ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజలు రక్తపు కన్నీళ్లతో విలపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, దేశంలో ఎప్పుడైనా అంతర్యుద్ధం సైరన్ మోగవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), సౌదీ అరేబియా కూడా కశ్మీర్ సమస్యను పాకిస్తాన్ వదిలివేయకపోతే, దానిని మునిగిపోకుండా ఎవరూ రక్షించలేరని స్పష్టంగా వివరించాయి.

Exit mobile version