Pakistan Crisis: పాక్‌లో ముదిరిన సంక్షోభం.. అత్యవసర భేటీకి తాత్కాలిక ప్రధాని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Crisis: పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. పెరిగిన విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే విద్యుత్ ధరలకు సంబంధించి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్-హక్ కాకర్ ఆగస్టు 27న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మీడియా నివేదికల ప్రకారం.. విద్యుత్ ధరల విషయంలో పూర్తి సమాచారం అందించాలని ప్రధాని అన్వరుల్-హక్ కకర్ పాకిస్తాన్ ఇంధన మంత్రిత్వ శాఖ, విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు. దీంతో పాటు పెరిగిన కరెంటు ధరల నుంచి దేశ ప్రజలకు ఎలా ఉపశమనం కల్పించాలనేది కూడా ఆలోచిస్తున్నారు. దేశంలోని సాధారణ ప్రజలతో పాటు, కార్మిక సంఘాల ప్రజలు విద్యుత్ ధరల పెంపు తర్వాత అనేక నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ అంశంపై చర్చలు ప్రారంభించింది.
Also Read
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
- Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
Read Also: Jawahar Point: చంద్రుడిపై జవహర్ పాయింట్.. రాజుకున్న రాజకీయ వివాదం
గతంలో, కరాచీలో పెరిగిన విద్యుత్ ధరలపై అనేక నిరసనలు జరిగాయి. ఇక్కడ జరిగిన ప్రదర్శనలకు జమాతే ఇస్లామీ (JI) మద్దతు ఇచ్చింది. కరాచీలో జరిగిన నిరసన కార్యక్రమంలో అమీర్ హఫీజ్ నైమూర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. పాకిస్థాన్‌లోని రావల్పిండి నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తాయి. లాహోర్, అటాక్, పెషావర్, క్వెట్టా, తౌన్సా, హైదరాబాద్, నవాబ్షా, రహీమ్ యార్ ఖాన్, ముల్తాన్లలో కూడా పెరిగిన విద్యుత్ రేట్లకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పాకిస్థాన్ ప్రజలు పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు.
తాజావార్తలు
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!