NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ జట్టులో విభేదాలు.. రెండుగా చీలిపోయిన టీమ్..?

Pak

Pak

Pakistan Team: టీ20 వరల్డ్ కప్ 2024లో తొలి మ్యాచ్ లో అనవసర తప్పిదాలతో పాక్ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ మెగా టోర్నమెంట్ కు ముందు కఠినమైన ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం.. ఇక, ప్రత్యర్థులకు చుక్కలే అని ప్రగల్బాలు పలికిన దాయాది దేశం.. తీరా ఈ టోర్నీని దారుణమైన ఓటమితో స్టార్ట్ చేసింది. పసికూన అమెరికా చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శల పాలైతుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టులో ఉన్న వర్గ విభేదాలు ఈ మ్యాచ్ తర్వాత బయటపడ్డాయి. స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ కు కెప్టెన్ బాబర్ ఆజామ్ కు మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది.

Read Also: Ramoji Rao: రామోజీరావు స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు..

అయితే, వరల్డ్ కప్ లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్లో పాక్ ఓడిపోయింది. ఇక, ఈ మ్యాచ్ లో అమెరికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 15వ ఓవర్ వేసి 4 రన్స్ ఇచ్చి ఓ వికెట్ తీసిన పేసర్ మహ్మద్ అమీర్.. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది.. కాబట్టి పేసర్లతోనే బౌలింగ్ చేయించాలని కెప్టెన్ బాబర్ అజామ్ కు అతడు సూచించాడు. అయితే, అప్పటికే అమెరికా బ్యాటర్ జోన్స్.. స్పిన్నర్లను ఈజీగా ఎదుర్కొంటూ రన్స్ రాబడుతున్నాడు. పేసర్లు అయితే అతడిని అడ్డుకుంటారని అమీర్ సూచించాడు. కానీ అతడి మాటలను పట్టించుకోని బాబర్.. షాదాబ్ ఖాన్ తో బౌలింగ్ వేయించాడు. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 11 పరుగులు వచ్చాయి.

Read Also: Ramoji Rao: మోడీ ప్రమాణ స్వీకారం ఉన్నా ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరిన పవన్

కాగా, షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవరే మ్యాచ్ ను టర్న్ చేసింది. అందుకే అమీర్ మాటలను విని పేసర్లతో బౌలింగ్ చేయిస్తే.. జోన్స్ అవుట్ అయ్యేవాడని, పాకిస్తాన్ జట్టు విజయం సాధించేదని కొందరు వ్యాఖ్యనిస్తున్నారు. మ్యాచ్ తర్వాత పాక్ జట్టులో ఉన్న విభేదాలు స్పష్టంగా కనిపించాయని మరికొందరు అంటున్నారు. పాక్ టీమ్ లో ప్లేయర్స్ రెండు గ్రూప్ లుగా విడిపోయారనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి నిజంగానే అమీర్ చెప్పినట్లుగా బాబర్ ఆజామ్ విని.. పేసర్లతో బౌలింగ్ చేయిస్తే.. రిజల్ట్స్ వేరేలా ఉండేదాని కామెంట్స్ పెడుతున్నారు.