NTV Telugu Site icon

Shaharyar Khan: పాక్‌ క్రికెట్‌ బోర్డు మాజీ ఛైర్మన్ కన్నుమూత

Shaharyar Khan

Shaharyar Khan

Shaharyar Khan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) నేడు(మార్చి 23) లాహోర్‌లో కన్నుమూశారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఓ పత్రికా ప్రకటన ద్వారా ఈ సమాచారాన్ని తెలిపింది. షహర్యార్ ఖాన్ మరణం పాక్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. షహర్యార్ ఖాన్ రెండు వేర్వేరు పర్యాయాల్లో పీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన 1999, ఐసీసీ ప్రపంచ కప్ 2003 సమయంలో భారత పర్యటనలో పాకిస్తాన్ పురుషుల జట్టుకు మేనేజర్‌గా పనిచేశారు.

ఈ విషాద వార్తను పీసీబీ శనివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ ఉదయం లాహోర్‌లో మాజీ చైర్మన్ పీసీబీ షహర్యార్ ఖాన్ మృతి పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, దాని ఛైర్మన్, గవర్నర్ల బోర్డు, సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. షహర్యార్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి అంటూ ఖాన్ మరణంపై హార్దిక్ తన సంతాపాన్ని తెలియజేసాడు. గత దశాబ్దంలో పాకిస్థాన్‌కు క్రికెట్‌ను తిరిగి తీసుకురావడంలో కీలక పాత్రధారిగా అతనిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆకాంక్షించాడు.

Read Also: PBKS vs DC: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

ఫిబ్రవరి నెలలో పీసీబీ మొహ్సిన్ నఖ్వీని ఛైర్మన్‌గా చేసి, 3 సంవత్సరాల పదవీకాలానికి నియమించింది.మొహ్సిన్ నఖ్వీ 37వ పీసీబి ఛైర్మన్‌గా ఉన్నారు. పీసీబీ మాజీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను అని నఖ్వీ తెలిపారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, పాకిస్తాన్ క్రికెట్‌కు అత్యంత అంకితభావంతో సేవలందించారని గుర్తు చేశారు.

ప్రస్తుతం, అందరూ ఐపీఎల్‌ ఆడుతూ బిజీగా ఉన్నారు. అయితే పాకిస్తాన్ 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో న్యూజిలాండ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తొలి మూడు టీ20 మ్యాచ్‌లు ఏప్రిల్ 18, 20, 21 తేదీల్లో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. దీని తర్వాత మిగిలిన 2 మ్యాచ్‌లు ఏప్రిల్ 25, 27 తేదీల్లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరగనున్నాయి.