పాకిస్తాన్ పెషావర్‌లోని ఓ మసీదులో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 93కు చేరింది. 221 మందిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారని సమాచారం. పెషావర్ హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఓ మసీదులో వందలాది మంది మధ్యాహ్నం నమాజ్ చేస్తుండగా.. ఈ బాంబు దాడి జరిగింది. పోలీసులు, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ప్రార్థన చేస్తున్న వారి ముందు వరుసలోకి బాంబులతో వచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఈ విషయాలను పెషావర్ అధికారులు వెల్లడించారు. పోలీసు అధికారులు, ఆర్మీ సిబ్బంది నివాసాలకు ఈ మసీదు సమీపంలోనే ఉంది.
INDvsAUS Test: ఇండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్‌కు షాక్.. స్టార్ పేసర్‌కు గాయం
పెషావర్ మసీదులో జరిగింది ఆత్మాహుతి దాడేనని క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మహ్మద్ ఐజాజ్ ఖాన్.. పాకిస్థాన్ ఛానెల్ జియో టీవీకి తెలిపారు. దాడికి పాల్పడిన దుండగుడి తెగిన తల కనుగొన్నామని వెల్లడించారు. “పోలీస్ లైన్స్‌లోకి దాడికి పాల్పడిన వ్యక్తి ముందుగానే వచ్చి ఉంటాడు. మసీదులో ప్రవేశించేందుకు అతడు అధికారిక వాహనాన్నే వినియోగించి ఉండొచ్చు ” అని జియో టీవీతో ఆయన అన్నారు.
Union Budget 2023: పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
బాంబు దాడితో మసీదులోని చాలా భాగం కుప్పకూలిపోయింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపు ఇంకా సాగుతోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ దాడికి తామే పాల్పడ్డామని తెహ్రెక్-ఈ-తాలిబన్‌కు చెందిన కమాండర్ ఉమర్ ఖాలిద్ వెల్లడించారు.