Breaking News: బలూచిస్తాన్‌లో రైలు హైజాక్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబన్ల దాడులతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో గల మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలను రెస్క్యూ బృందం ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.