ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ట్విట్టర్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. బుధవారం ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తీవ్రవాద గ్రూప్‌లు తరుచుగా దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌ను బ్లాక్ చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఇప్పుడు సుదీర్ఘకాలం దీన్ని బ్యాన్ చేసినట్లు బుధవారం న్యాయస్థానంలో అంతర్గత మంత్రిత్వ శాఖ వ్రాతపూర్వకంగా తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Kerala: పాలస్తీనా అనుకూల బోర్డుల్ని తొలగించిన విదేశీ టూరిస్ట్.. కొచ్చిలో వివాదం..
ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికలు చాలా గందరగోళంగా జరిగాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టలేదు. ఇక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక నవాజ్ షరీఫ్-బెనజీర్ భుట్టో పార్టీల కలయికతో పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నవాజ్ షరీఫ్ సోదరుడు షేబాజ్ షరీఫ్ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఇక జర్దారీ రెండోసారి దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో నెలకొన్న భద్రతా సమస్యల నేపథ్యంలో ఎక్స్ ట్విట్టర్‌ను బ్యాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇక ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాలి.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: బీజేపీతో వైసీపీకి తెర వెనుక సంబంధాలు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి అంబటి