Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్ వాయుసేన తూర్పు ఆఫ్గానిస్థాన్‌పై అర్ధరాత్రి వేళ విరుచుకుపడింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న కునార్, పక్తికా ప్రాంతాలపై పాక్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. కునార్ ప్రావిన్స్‌లోని నూర్గల్ జిల్లాలో గల పతంగ్ అనే ప్రాంతంలో రాత్రి సుమారు 3:30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. చాలా తక్కువ ఎత్తులో దూసుకొచ్చిన పాక్ జెట్ విమానాలు పౌరుల ఇళ్లపై బాంబులు జార విడచడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా నూర్గల్ జిల్లాలో నివసిస్తున్న నూర్ మహమ్మద్ అనే సాధారణ పౌరుడి ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాంబుల తాకిడికి ఆ ఇల్లు పూర్తిగా కూలిపోయి మట్టిదిబ్బలా మారిపోయింది.
తీవ్రంగా గాయపడిన పలువురిని ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. సంఘటనా స్థలంలో స్థానికులు పేలిపోయిన బాంబుల శకలాలను సేకరించారు. ఇక, గత కొంతకాలంగా పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమే పాకిస్థాన్ ఈ కొత్త దాడికి పాల్పడటం గమనార్హం. అర్ధరాత్రి వేళ ప్రజలంతా తమ ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అఫ్గాన్ సరిహద్దు గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ వైమానిక దాడిలో జరిగిన పూర్తి నష్టం, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?