NTV Telugu Site icon

Babar Azam: దురదృష్టవశాత్తు అది వర్కౌట్ కాలేదు.. మా ఓటమికి కారణం ఆ ఇద్దరే: బాబర్ ఆజామ్

Babar Azam Head

Babar Azam Head

Pakistan Captain Babar Azam React on Defeat vs Sri Lanka in Asia Cup 2023: ఫైనల్ ఓవర్‌ను జమాన్ ఖాన్‌తో వేయించడం వర్కౌట్ కాలేదు అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చెప్పాడు. కుశాల్ మెండీస్, సదీర సమరవిక్రమా భాగస్వామ్యం తమను దెబ్బతీసిందని తెలిపాడు. ఆసియా కప్‌ 2023 సూపర్‌-4లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఓడిన పాకిస్థాన్‌ ఫైనల్స్​లో అడుగుపెట్టలేదు. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో లంక చివరి బంతికి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ ఓటమిపై స్పందించాడు.

‘చివరి ఓవర్లను మా అత్యుత్తమ బౌలర్లతో బౌలింగ్ చేయించాలని నిర్ణయించుకున్నాము. అందుకే 47వ ఓవర్‌ను షాహీన్‌ ఆఫ్రిది వేశాడు. చివరి ఓవర్‌ వేసే జమాన్ ఖాన్‌పై నమ్మకం ఉంచాం. దురదృష్టవశాత్తు అది వర్కౌట్ కాలేదు. శ్రీలంక బాగా ఆడింది. వారు మాకంటే బాగా క్రికెట్ ఆడారు.. అందుకే గెలిచారు. మేము మా బౌలింగ్, ఫీల్డింగ్‌లో వెనకపడిపోయాం. అందుకే ఓడిపోయాం. మిడిల్ ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం మా ఓటమిని శాసించింది’ అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు.

Also Read: IND vs BAN: బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌.. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అవుట్! శ్రేయస్‌, సూర్య ఇన్

‘కుశాల్ మెండీస్, సమరవిక్రమా భాగస్వామ్యం మమ్మల్ని దెబ్బతీసింది. మేము బాగా స్టార్ట్ చేస్తున్నాం, బాగా ఫినిష్ చేస్తున్నాం. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం లేదు. అదే మా జట్టు ఓటమికి కారణం అవుతొంది’ అని బాబర్ ఆజామ్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్ (86 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 58) రెండు వికెట్లు పడగొట్టాడు. మహీశ్ తీక్షణ, దునీత్ వెల్లలాగే(1/40)లకు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య చేధనలో శ్రీలంక 42 ఓవర్లలో 252 పరుగులే చేసి గెలుపొందింది. కుశాల్ మెండీస్ (91), సమరవిక్రమా (48), చరిత్ అసలంక(49 నాటౌట్) రాణించారు.