మన దేశం ప్రధాన పంట వరి.. వరిలో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది..అందుకే వరిలో కలుపు సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.అయితే ఈ కలుపు నివారణకు ఏం చెయ్యాలో కలుపు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వరినారులో కలుపు నివారణ కాస్త కష్టమైన పనే.. నివారణకు బ్యూటిక్లోర్ 50 ఎం.ఎల్ మందును ఎకరాకు 5 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బిన్ పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5 ఎం.ఎల్ మందును ఒక లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు వేసుకోవాలి. నాటిన వరి పొలంలో కలుపు యాజమాన్యం కోసం బ్యూటిక్లోర్ లీటరు మందును 200 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. సైహలోవాప్ పిబ్యూటైల్ 300 ఎం.ఎల్ ను పిచికారి చేస్తే సరిపోతుంది..
వరి నారును పొలంలో నాటిన వారం రోజులకే లీటరు బుటాక్లోర్, అనిలోఫాస్, ప్రటిలాక్టేర్‌లలో ఏదో ఒక రసాయానాన్ని పొడి ఇసుకలో కలిపి పొలంలో చల్లుకోవాలి. వరి నాటిన 30రోజుల్లో కలుపు నివారణకు ఎకరానికి 400 గ్రాముల 2, 4డి సోడియం సాల్డ్ లేదా 50 గ్రా ముల ఇథాక్సిసల్ఫ్యురాన్ పొడిని పిలిచికారి చేయాలి..ప్రిటిలాక్లోర్ సెఫనర్ మందును ఎకరాకు 600 మి.లీ నుండి 800 మి.లీ వరకు విత్తిన 5 రోజుల లోపు వాడుకోవాలి. పైరజో సల్య్ఫురాన్ ఈథైల్ అను కలుపు మందును ఎకరాకు 80 నుండి 100 గ్రాములు విత్తిన 8 నుండి 10 రోజుల లోపు వాడాలి. ఇది గడ్డి జాతి కలుపును నివారిస్తుంది. కలుపులో రకాలను బట్టి మందును పిచికారి చెయ్యాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..