ప్రస్తుత ప్రజాస్వామ్య భారతదేశంలో అతి పెద్ద మైనారిటీలైన ముస్లింలు పౌరులు కాదని మాజీ హోం మంత్రి చిదంబరం పేర్కొన్నారు. హిందువులు కాని వారు సగం పౌరులని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీపై తన ఉపన్యాసంలో ఆయన ఈ విషయాలను తెలిపారు. ప్రస్తుత భారత ప్రజాస్వామ్యం గురించి వాస్తవాలను నిర్మొహమాటంగా చెప్పారు. చాలా మంది ప్రజలు భయంతో జీవిస్తున్నారు.. మాజీ న్యాయ మంత్రి కూడా కొలీజియం వ్యవస్థ కోసం పోరాటం చేశారు.. భారతదేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉందో.. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుంది అనేది మనం చూడొచ్చు అని మాజీ హోం మంత్రి చిదంబరం అన్నారు.
Read Also: Minister KTR: కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్.. ఇవాళ ఎక్కడంటే..
అయితే, ఎన్నికల్లో మతం ప్రస్తావన ఉండకూడదు.. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో ఇది చాలా వరకు జరుగుతోంది అని చిదంబరం తెలిపారు. మతం విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి.. ఒక రాజకీయ పార్టీ హిందువులను కాకుండా ఇతర అభ్యర్థులను నిలబెట్టడానికి నిరాకరిస్తూనే ఉందని ఆయన వెల్లడించారు. అఖండ భారతదేశం హిందూ రాష్ట్రంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. మతం నిర్ణయాత్మక అంశంగా కనిపిస్తోంది.. ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు అంటూ చిదంబరం అసహనం వ్యక్తం చేశారు.
Read Also: IPL 2024 Retentions: స్టోక్స్, రాయుడుకు గుడ్‌బై.. చెన్నై రిలీజ్, రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
రిజర్వేషన్ల ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు కులాల వారీగా సర్వే అవసరం.. కేంద్ర ప్రభుత్వం జనాభా గణనతో పాటు దానిని నిర్వహించాలని మాజీ హోం మంత్రి చిదంబరం అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2021లో నిర్వహించాల్సిన జనగణనను నిర్వహించకపోవడంతో.. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దాన్ని వాయిదా వేశారు. బీహార్ ప్రభుత్వం కులాల వారీగా సర్వే నిర్వహించి.. అణగారిన వర్గాలకు 65 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని చిదంబరం గుర్తు చేశారు. జాతీయ జనగణన కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ జనాభా గణనను నిర్వహించలేవు.. కావున కులాల వారీగా గణన చేయాలని నిర్ణయించారు.. ఎందుకంటే ఇది లేకుండా ఎంత మంది రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోతున్నారో తెలుసుకోవడం సాధ్యం కాదు అని చిదంబరం చెప్పుకొచ్చారు.