Dog : ఆత్మహత్య చేసుకున్న యజమానిని రక్షించేందుకు 4గంటలు పోరాడిన కుక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog : ‘కుక్కకు ఉన్న విశ్వాసం నీకు లేదు’ అంటాం. నిజానికి కుక్కను కాస్త అన్నంపెట్టి ఆదరిస్తే చాలు చచ్చేంత వరకు విశ్వాసం చూపిస్తుంది. తన యజమానికి ఏ అపాయం ఎదురైన తన శాయశక్తులా కాపాడుకునేందుకు పోరాడుతుంది. అలాగే ఓ కుక్క తన యజమాని ఉరేసుకోబోతుండగా నాలుగు గంటలపాటు కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ తన వల్ల కాలేదు.. చివరికి పోలీసులు, పొరుగు వారు వచ్చి యజమాని మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. తన యజమాని మరణాన్ని తట్టుకోలేక ఆ శునకం కాసేపటికే చనిపోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఝాన్సీ జిల్లా కేంద్రంలోని పంచవటిలోని పోష్ కాలనీలో సంభవ్ అగ్నిహోత్రి(25) అనే యువకుడు యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అతడి తల్లి కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో తండ్రి ఆనంద్ అగ్నిహోత్రి రైల్వే ఉద్యోగి. ఆమెను తీసుకొని భోపాల్ వెళ్లాడు. దీంతో స్థానిక నలంద గార్డెన్ లో సంభవ్ ఒంటరిగా చాలా సేపు కూర్చొని ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో తండ్రి ఆనంద్ కొడుకుకు ఫోన్ చేశాడు.. ఎన్ని సార్లు చేసినా సంభవ్ ఎత్తలేదు.
Read Also:Tomato Prices Down: టమోటా రైతుల ఆవేదన.. కేజీ 2 రూపాయలే
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ఇంటికి వెళ్లిన తరువాత అగ్నిహోత్రి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అయితే దీనిని అతడి పెంపుడు కుక్క అలెక్స్ గమనించింది. దానికి చేతగాకపోయినా యజమానిని కాపాడేందుకు తీవ్రంగా యత్నించింది. ఈ క్రమంలో కుక్క బాగా అరిచింది. ఈ అరుపులు పక్కింట్లో నివసించేవారికి వినిపించాయి. ఇదే సమయంలో తండ్రి చుట్టుపక్కల నివసించే వారికి కాల్ చేశాడు. తమ కుమారుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, వెంటనే ఇంటికి వెళ్లి చూడాలని సూచించాడు. దీంతో వారందరూ ఇంటికి వెళ్లి చూశారు. వారు వెళ్లి చూసేసరికి ఓ గదిలో అగ్నిహోత్రి ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. అయితే వారిని ఆ శునకం లోపలికి రానివ్వలేదు. దీంతో వారంతా కలిసి పోలీసులకు ఫోన్ చేశారు. వారిని కూడా అలెక్స్ అడ్డుకుంది. చివరికి దానికి మత్తు మందు ఇచ్చి లోపలికి వెళ్లారు. అగ్నిహోత్రి బట్టలపై, కాళ్లపై గీతలు కనిపించాయి. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. అయితే మృతుడు తన పుస్తకాల్లో పలు విషయాలు రాసుకొచ్చాడు. తాను గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయానని బాధపడ్డాడు. కాగా.. అప్పటి నుంచి తీవ్ర ఒత్తిడితో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ వారు లేని సమయంలో చూడా అతడు ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జరిగిన కొంత సమయానికే అలెక్స్ కూడా చనిపోయింది. అయితే మత్తు మందు డోస్ ఎక్కువవడంతోనే అది మరణించదని స్థానికులు ఆరోపించారు. ఒకే రోజు కుమారుడు, పెంపుడు జంతువు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. ఆ కాలనీ మొత్తం విషాదంలో మునిగిపోయింది.
Read Also:Chikoti Praveen: 12వ తేదీ రావాల్సిందే.. చీకోటికి మరోసారి ఈడీ నోటీసులు..
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!