Site icon NTV Telugu

Bomb Threat Emails : ముంబైలోని 60కి పైగా సంస్థలకు బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు..

Bomb Threat Emails

Bomb Threat Emails

Bomb Threat Emails : బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లోని ప్రముఖ ఆసుపత్రులు, కళాశాలలతో సహా ముంబై(Mumbai) లోని 60కి పైగా సంస్థలకు బాంబు పేలుళ్ల బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని, ఆ తర్వాత వాటిలో అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడనప్పటికీ సోదాలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి సోమ, మంగళవారాల్లో ఒకే మెయిల్ ఐడీ నుంచి ఈమెయిల్స్ వచ్చాయని తెలిపారు.

Raai Laxmi : చేతిలో వైన్ గ్లాస్ తో రత్తాలు..బికినీ అందాలు అదుర్స్..

మంగళవారం నాడు అందిన ఇమెయిల్‌లు సోమవారం ఇమెయిల్‌స్ లాగే ఉన్నాయి. ఇందులో నగరం అంతటా ప్రముఖ ప్రైవేట్, రాష్ట్ర పౌర ఆసుపత్రులు అలాగే కొన్ని కళాశాలలకు బాంబు బెదిరింపు ఉందని పేర్కొన్నట్లు వారు తెలిపారు.

AP: “పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాల్లో ఫోటోలు, రాజకీయ పార్టీ జెండాలు ఉండొద్దు”

ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున, బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ BMC, ఇతర సంస్థలకు ఇలాంటి బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయని ఆయన చెప్పారు. వీటి విచారణలో, ముంబై పోలీసులు ఆ సంస్థలలో భద్రతా తనిఖీలు నిర్వహించగా ఈ ప్రదేశాలన్నింటిలో అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడకపోవడంతో ఎవరో అల్లర్లు సృష్టించడానికి వచ్చాయని ఆయన చెప్పారు. ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

Exit mobile version