Site icon NTV Telugu

Corona: యూకేలో కరోనా విజృంభణ.. అక్టోబర్‌లో 2 మిలియన్ల మందికి కొవిడ్ పాజిటివ్

Uk Covid

Uk Covid

Corona: గతంలో గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న నేపథ్యంలో కొత్త కొత్త వేరియంట్లు మళ్లీ భయాందోళనను కలిగిస్తున్నాయి. బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. గత కొన్ని రోజులుగా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క అక్టోబర్‌ నెలలోనే యూకేలో 20 లక్షల మంది కొవిడ్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌లోని ప్రతి 30 మందిలో ఒకరికి కొవిడ్‌ ఉన్నట్లు ది గార్డియన్‌ నివేదించింది. గడిచిన ఒక్క వారంలోనే యూకేలో 1,706,200 మంది కొవిడ్ బారిన పడ్డారని ఈ నివేదిక సూచించింది.

Prashant Kishor: నితీష్‌కుమార్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ సవాల్‌.. నిజంగా బీజేపీతో సంబంధం లేకుంటే ఆ పని చెయ్..

‘ఇంగ్లాండ్‌ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.’ ‍అని కోవిడ్‌-19 సర్వే చేపట్టిన సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ సారా క్రాఫ్ట్‌ ‘ది గార్డియన్‌’తో అన్నారు. ముందు ముందు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు, యూకే ఆరోగ్య విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్టోబర్‌ 10తో ముగిసిన వారంలో 8,198 మంది ఆసుపత్రుల్లో చేరారు. అక్టోబర్‌ 17 వరకు 7,809 మంది చేరినట్లు తెలిసింది. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ఈ నెల చివరి నాటికి మరింత విజృంభించే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బీఏ.5 పరివర్తనం చెంది ఒమిక్రాన్‌ బీక్యూ1.1 అనే కొత్త వేరియంట్‌ ఉద్భవించింది. ప్రస్తుతం బీక్యూ1.1 వేరియంట్‌ రోగనిరోధక శక్తి కళ్లుగప్పి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 300లకుపైగా ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అవన్నీ రోగనిరోధక శక్తి కళ్లుగప్పే విధంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

Exit mobile version