Oral health is overall health: నోటి ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ వరల్డ్ ఓరల్ హెల్త్ డే. ఈ సందర్భంగా గీతం వర్శిటీలో ఘనంగా ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. నోటి ఆరోగ్యం సాధారణ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని, జీవన నాణ్యతను (శారీరక, సామాజిక, మానసిక). =ప్రభావితం చేస్తుందని ప్రముఖ దంత వెద్యుడు డాక్టర్ రాము నోముల అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో సోమవారం “నిర్వహించిన ‘ప్రపంచ నోటి ఆరోగ్యం దినోత్సవం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనిని పురస్కరించుకుని రుద్రారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓరల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపుతో పాటు గీతం ఫార్మసీ విద్యార్థులతో అతిథ్యం ఉపన్యాసం నిర్వహించారు. నోటి నుంచి వచ్చే బ్యాక్టీరియా నేరుగా లాలాజలం, రక్తం ద్వారా గుండెలోకి ప్రవేశిస్తుందని, దీనివల్ల గుండెల్లో మంట వస్తుందని, దీనిని బాక్టీరియల్ ఎండోకార్డిటీస్ అంటారని డాక్టర్ రాము పేర్కొన్నారు.
నోటి పరిశుభ్రతను పాటించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని వర్ధమాన ఫార్మసిస్ట్లకు ఆయన ఉద్బోధించారు. మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి నోరు కూడా ఒక సాధనమని, చక్కగా మాట్లాడడం, హాయిగా నవ్వడం, రుచి చూడటం, సరైన పోషకాహారాన్ని జీర్ణించుకోవడంపై నోటి ఆరోగ్యం ప్రభావం చూపుతుందని డాక్టర్ రాము. వివరించారు. మంచి బ్రష్ తో పళ్ళు తోనుడానికి ఎంపిక చేసుకోవాలని, మూడు నుంచి ఐదు నిముషాల లోపు పళ్లను తోమడం ముగించాలని, త్వరత్వరగా బ్రష్ చేయకూడదని ఆయన సూచించారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
Read Also:Suriya: తండ్రితో విబేధాలు.. భార్యాబిడ్డలతో సహా బయటికి వెళ్ళిపోయిన సూర్య..?
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే అది ఇన్ఫెక్షన్ కు దారితీస్తుందని, దాని ఫలితంగా చిగుర్లకు కావిటీ (గుల్ల ఏర్పడడం), తద్వారా చికాకులు ఏర్పడతాయన్నారు. ఇది రక్తస్రావం, పళ్లూడడానికి దారితీస్తుందని చెప్పారు. అధిక మధ్యనవనం, మాదకద్రవ్యాల వినియోగం, ధూమపానం దంతక్షయాన్ని పెంచుతుందని, ఇది కొన్నిరకాల నోటి క్యాన్సర్కు దారితీయడమే గాక పళ్లు ఊడిపోవడానికి కూడా దారితీస్తుందన్నారు. వాటిని చూసుకోవడంతో పాటు చక్కెర పదార్థాలను పరిసుద్ధంగా రుణించాలని డాక్టర్ రాము సూచించారు. రోజుకు రెండుసార్లు పళ్లు తోసుకోవాలని, పడుకునే ముందు లేదా భోజనం తరువాత నీరు పుక్కిలించి ఉమ్మాలని, ఆరో నీటితో కాకుండా కుళాయి ద్వారా వచ్చే మునిసిపల్ నీటితో దంతావధానం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన భోజనం చేయాలని, తీపి పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని, ఎక్కువ నీటిని తాగడంతో పాటు విడానికి ఒక్కసారైనా వెద్యులనే దంత పరీక్షలు చేయించుకోవడం ద్వారా దంతక్షయాన్ని నివారించ డాక్టర్ రాము నోముల వివరించారు.
కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ ఎ సుధా మాట్లాడుతూ ధూమపానం, పొగాకు నమలడం అనేక ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని, అందువల్ల వాటికి దూరంగా ఉండడమే మేలని హితవు పలికారు. తొలుత, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శకునూర్ అతిథులను స్వాగతించి, సత్కరించారు. కార్యక్రము సమన్వయకర్త డాక్టర్ సీహెచ్ పవన్ కుమార్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు విద్యార్థులు కూడా పాల్గొన్నారు. దాదాపు 200 మంది రుద్రారం పాఠశాల విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!